27.7 C
Hyderabad
May 4, 2024 09: 19 AM
Slider విజయనగరం

పన్నుల పెంపు అంశంపై అధికార పార్టీ వివరణ ఇది…!

#YSRCPVijayanagaram

ఉత్తరాంధ్ర లోని మరీ ముఖ్యంగా విజయనగరం లో అధికార వైఎస్సార్సీపీ ,ప్రతిపక్ష టీడీపీల మధ్య ‘పన్నుల పెంపు’ అన్న అంశంపై మాటల యుధ్ధం జరుగుతోంది. టీడీపీ పేర్కొన్న అంశానికి బదులుగా అధికార వైఎస్సార్సీపీ నగర పార్టీ నేతలు మీడియా ముఖంగా ప్రజలకు వాస్తవాలను తెలియజేసారు.

పన్నుల పెంపు విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు నిరసన తెలపడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎస్ వి వి  రాజేష్, డాక్టర్ వి ఎస్ ప్రసాద్ లు అన్నారు. శనివారం నాడు ఎమ్మెల్యే కోలగట్ల నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతలు మాట్లాడారు.

ఆస్తిపన్ను ఎలా పెంచుతారు అన్న విషయం టీడీపీ నేతలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. రీ ఫార్మ్స్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రామాణికాలు కు అనుగుణంగా పన్నుల పెంపుదల చేస్తారన్న విషయం తెలుగుదేశం పార్టీ నేతలు తెలుసుకొని మాట్లాడాలి అన్నారు.

2002 సంవత్సరంలో అప్పటి బాబు ప్రభుత్వం రెసిడెన్షియల్ కు యాభై కమర్షియల్ లకు వంద శాతం పన్నులు పెంచిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పెరుగుతున్న జనాభా, నగర పరిధి, సేవల దృష్ట్యా పన్నులు వసూలు చేయక తప్పదు అన్నారు.

సీఎం జగన్ నిర్దిష్ట ప్రామాణికాలను తీసుకుని పన్నుల విషయంలో 15% మించకుండా ఉండాలన్నది గైడ్లైన్స్ ప్రకారం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.  పేద ప్రజలు ఇబ్బంది పడకుండా, ఆయా డివిజన్లలో పేద ప్రజలకు వైఎస్సార్సీపీ శ్రేణులు అండగా ఉంటూ పన్నులు దఫ దఫాలుగా కట్టించే విధంగా చూస్తామన్నారు.

ఎమ్మెల్యే కోలగట్ల ఎవరు పన్నులు బకాయి ఉన్నారు, సంబంధిత లిస్ట్ ద్వారా తెలుసుకుని అధికారులకు తగు ఆదేశాలు జారీ చేస్తున్నారన్నారు. కేవలం 0.1% నుంచి 0.5% వరకు పెరిగిందే తప్ప, పన్ను భారం ప్రజలపై పడకుండా చేయాలని అధికారులకు ఎమ్మెల్యే కోలగట్ల స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు.

కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు తన ఆస్తుల పై వేసిన పన్నులు కట్టవలసిన బకాయిలు చాలా వరకు ఉన్నాయన్నారు. పన్నుల నోటీసులు అందుకుని, కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకున్న సంస్కృతి వారిదే నన్నారు. పన్నుల పెంపు విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు.

పన్నుల పెంపు  ఏ విధంగా జరుగుతుందో ముందుగా ఆ పార్టీ నేతలు తెలుసుకుని మాట్లాడాలి అన్నారు. ఈ సమావేశంలో నగర పార్టీ అధ్యక్షులు ఆసాపు వేణు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రెడ్డి గురు మూర్తులు ఉన్నారు.

Related posts

బాధిత కుటుంబాలకు సిఎంఆర్ఎఫ్ పంపిణీ

Satyam NEWS

బాధితుడికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందచేత

Satyam NEWS

వెంకటగిరిని ఆదర్శ మునిసిపాలిటీగా తీర్చిదిద్దుదాం

Satyam NEWS

Leave a Comment