29.7 C
Hyderabad
May 3, 2024 03: 43 AM
Slider ప్రత్యేకం

ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ ధ్యేయంగా పని చేయాలి: మంత్రి తానేటి వనిత

#tanetivanita

మహిళల భద్రత, ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని,  ఆర్ధిక భారం అయినా  లెక్క చేయకుండా  నిధులను కేటాయిస్తోందని  రాష్ట్ర  మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. ఈ మేరకు ఒక్క రోజు పర్యటన పర్యటన లో విజయనగరం లో మంత్రి మాట్లాడారు.

గత ప్రభుత్వం  500 కోట్ల ను కేటాయిస్తే ఈ ప్రభుత్వం 1800  కోట్ల రూపాయలను కేటాయించి మహిళల పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకుందని అన్నారు. జిల్లా  రిషత్ సమావేశ మందిరం లో ఐ.సీ.డీ.ఎస్ సీ.డీ.పీ.ఓ లు, సూపర్ వైజర్లతో సమీక్షించారు. సీ.డీ.పీ.ఓ లు, సూపర్ వైజర్లు తమ పరిధి లోనున్న అంగన్వాడి కేంద్రాలను  రెగ్యులర్ గా తనిఖీలు చేయాలనీ ఆదేశించారు. 

క్షేత్ర స్థాయి లో వై.ఎస్.ఆర్ సంపూర్ణ పోషణ్, పోషణ్ ప్లస్ కార్యక్రమాల క్రింద అందిస్తున్న  ఎండు ఖర్జూరం, బెల్లం, చిక్కీలు, గుడ్లు నాణ్యంగా ఉండడం లేదని కొన్ని చోట్ల ఫిర్యాదులు అందుతున్నాయని,  ఈ పరిస్థితి ప్రభుత్వానికి చెడ్డ పేరును తెస్తుందని అన్నారు . నాణ్యమైన సరుకులు రానపుడు  డెలివరీ తీసుకోకుండా తిరిగి పంపించి వేయాలని అన్నారు.   స్టాక్ వచ్చేటప్పుడే వెరిఫికేషన్ చేసుకోవాలని, నాణ్యత లేని వాటిని సరఫరా చేసిన వారికి నోటీసు లు జారి చేయాలనీ సూచించారు. 

లోపాలను సవరించుకుంటే మెరుగైన సేవలు

తరచుగా అంగన్వాడి  కేంద్రాలను తనిఖీ చేస్తుంటేనే అక్కడి లోపాలు అధికారుల దృష్టికి వస్తాయని, లోపాలను సవరించుకుంటే  గ్రామాల్లో మెరుగైన సేవలు అందించగలమని అన్నారు.  ఈ తనిఖీలతో అంగన్వాడీ కేంద్రాల్లో బోగస్ నమోదును కూడా తగ్గించవచ్చని అన్నారు.   ఒక తనిఖీ కి  మరొకసారి వెళ్లి చేసిన తనిఖీ కి మధ్య జరిగిన మార్పులను కూడా గుర్తించాలన్నారు. 

ప్రభుత్వం గర్భిణీల, బాలింతల, పసి పిల్లల ఆరోగ్యానికి కేటాయిస్తున్న నిధులు వృద్ధా కాకుండా లబ్ది దారులకు అందిన నాడే  ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ సాధ్యమవుతుందని అన్నారు.   రాష్ట్రం లో క్లిష్హ్త మైన  ఆర్ధిక పరిస్థితి  ఉన్నప్పటికీ సంక్షేమ పధకాలను అమలుచేస్తున్న ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటీ మీరంతా చిత్త శుద్ధితో పని చేయాలనీ హితవు పలికారు.

ఈ సందర్భంగా మంత్రి  బాలల గృహం,  వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, మహిళా  ప్రాంగణం, వన్ స్టాప్ సెంటర్, ట్రాఫికింగ్,  జువనైల్ హోం, వయో వృద్ధులు, సదరం   తదితర  శాఖల పని తీరుపై సమీక్షించారు. సదరం క్యాంపు లను ప్రతి నియోజక వర్గం లో నిర్వహించాలన్నారు.   దివ్యాంగులకు ప్రభుత్వం అందజేస్తున్న ఉపకరణాల పై అందరికీ అవగాహన కలిగించాలన్నారు. జిల్లాలో   అంగన్వాడీ కేంద్రాల పని తీరు భేష్ గా ఉందని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మజ్జి శ్రీనివాస రావు కొనియాడారు. 

కరోనా తర్వాత కేంద్రాలను తిరిగి ప్రారంభించారని,  అసలైన లబ్ది దారులకు పౌష్టి కాహారం అందేలా చూడాలని అన్నారు.   బాల్య వివాహాలను నిరోధించడం లో ఐ.సీ.డీ.ఎస్ శాఖ పాత్ర అభినందనీయమని అన్నారు. సీఎం జగన్ మహిళా పక్షపాతిగా అనేక కార్యక్రమాలను చేపడుతున్నారని కొనియాడారు.  శాఖ లో  జిల్లాలో ఖాళీ గ ఉన్న పోస్ట్ లను నింపడం ద్వారా మరింత మెరుగైన సేవలను అందించవచ్చని, పోస్ట్ లను వీలున్నంత తొందరగా నింపాలని మంత్రిని కోరారు. 

అంగన్ వాడీ కేంద్రాల అభివృద్ధి

అసంపూర్తిగా ఉన్న అంగన్వాడి భవనాల కోసం జిల్లా పరిషత్ నిధులను కేటాయిస్తామని చైర్మన్  ప్రకటించగా  మంత్రి స్పందిస్తూ  అంగన్వాడీల అభివృద్ధికి ముందుకు వచ్చినందుకు  ధన్యవాదాలు తెలిపారు. అరకు ఎంపీ గొట్టేటి మధ్హవి మాట్లాడుతూ మైదాన ప్రాంతాల కంటే గిరిజన గ్రామాల పై ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు చేస్తోందని,  గిరిజనులు  అంగన్వాడీ కార్యకర్తలనే దేవుళ్ళుగా భావిస్తారని అన్నారు. 

గిరిజనులకు ఆరోగ్యం, ఆహారం పై పెద్దగా అవగాహనా ఉండదని, అంగన్వాడీ లే పెద్ద దిక్కని, వారికీ పౌష్టికాహారం పై అవగాహనా కల్పించడమే కాక అందించడం లో కూడా శ్రద్ధ చూపాలన్నారు. సంయుక్త కలెక్టర్ అభివృద్ధి  డా.మహేష్ కుమార్   క్షేత్ర స్థాయి  తనిఖీలకు ఒక షెడ్యుల్ తయారు చేస్తామన్నారు. స్టాక్ వెరిఫికేషన్  చేసి నాణ్యత లేని సరఫరా దారులకు  నోటీసు లు జరీ చేసేందుకు నిర్ణీత ప్రోఫార్మ  తయారు చేసి అన్ని సెక్టర్ లకు పంపిస్తామన్నారు.

ఈ సమావేశం అనంతరం  బాల్య వివాహాల రద్దు పై, దిశా మొబైల్ యాప్ , దిశా సేవలు పై వరల్డ్ విజన్ ముద్రించిన కర పత్రాలను, పోస్టర్  లను ఆవిష్కరించారు. ఈ సమావేశం లో ఎమ్మెల్యే కోలగట్ల వీర భద్ర స్వామి,   ప్రాంతీయ  ఉప సంచాలకులు చిన్మయి దేవి, పీ.డీ మహిళా అభివృద్ధి ఛైర్పర్సన్ శాంతకుమారి  తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇంకా తేలని నరేంద్రగిరి అఖాడా డెత్ మిస్టరీ

Sub Editor

అమెరికా బ్యాంకుల రుణం ముందే చెల్లించివేస్తున్న అదానీ

Satyam NEWS

ఆర్యవైశ్య సంఘ నేత మా శెట్టిని అభినందించిన కెప్టెన్ ఉత్తమ్

Satyam NEWS

Leave a Comment