29.7 C
Hyderabad
April 29, 2024 09: 59 AM
Slider కడప

బోర్డు తిప్పేసిన అన్నమయ్య చిట్స్ అండ్ డిపాజిటర్స్

#annamaiahachits

అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమయ్య చిట్స్ అండ్ డిపాజిట్స్ సం స్థ బోర్డు తిప్పేసింది. బాధితులు పోలీసుల్ని ఆశ్రయించడంతో ఆదివారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఐడీబీఐ బ్యాంక్ పై అంతస్తులో ఏర్పాటు చేసిన ఈ సంస్థ రూ.3 కోట్లకుపైగా వ్యాపార లావాదేవీలు కొనసాగించింది. డబ్బు చెల్లింపులు తదితర విషయాల్లో మోసాలు జరుగుతున్నాయని గమనించిన బాధితులు రాజం పేట రూరల్ పోలీసులను ఆశ్రయించారు. అన్నమయ్య చిట్స్ సంస్థ ద్వారా మోసపోయామని, తమ డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని 15 మంది ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ భక్తవత్సలం చెప్పారు.

నలుగురు వ్యక్తుల ఆధ్వర్యంలో నడిచిన ఈ సంస్థలో చిట్స్ పేరుతో రూ.20 లక్షలు మోసం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నాలుగు నెలలుగా ఈ సంస్థ నిర్వహణ గాడితప్పినట్లు బాధితులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సంస్థ బోర్డు కూడా కనిపించడంలేదు. కొన్నాళ్లుగా ముందువైపు తాళాలు వేసి వెనుకవైపు నుంచి కార్యకలాపాలను నిర్వహిం చడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నం దలూరు మండలంలోని తోటపాళేనికి చెందిన అరిగెల రవిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.

Related posts

భూ సమస్యలను పరిష్కరించాలి

Murali Krishna

కరోనా వ్యాక్సిన్ అందరికి అవసరం లేదు

Satyam NEWS

హాలీవుడ్ ను తలదన్నే గ్రాఫిక్స్ సృష్టించిన హైదరాబాద్ కంపెనీ

Satyam NEWS

Leave a Comment