42.2 C
Hyderabad
May 3, 2024 15: 59 PM
Slider ముఖ్యంశాలు

చక్రం తిప్పిన తుమ్మల.. భారీగా చేరికలు

#tummala

రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్లోకి భారీ చేరికలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ కి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి జిల్లాలోని సీనియర్ నాయకులు చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఖమ్మం నుండి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నియోజకవర్గం నుండి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీపై స్పష్టత రావడంతో ఈ చేరికలు ఊపందుకున్నాయి.

ఖమ్మం జిల్లాలో టిడిపిలో కీలకంగా వ్యవహరించి అనేక పదవులు చేపట్టి ప్రస్తుతం టిఆర్ఎస్ లో ఉన్న బీసీ వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు బాలసాని లక్ష్మీనారాయణ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఉదయం ఆయన ఇంటికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత ఖమ్మం కార్పొరేషన్ సంబంధించి కార్పొరేటర్ల ఇళ్లకు వెళ్లి వారిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు.

టిఆర్ఎస్ నగర అధ్యక్షునిగా టిఆర్ఎస్ లో కీలక నాయకుడైన కమర్తపు మురళితోపాటు మరో ఇద్దరు చావా నారాయణరావు, సైదుబాబులతోపాటు ఇద్దరు మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో ఖమ్మం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇదే సమయంలో ఖమ్మం అసెంబ్లీ నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హైదరాబాదులో కెసిఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకొని ఆ వెంటనే ఖమ్మం చేరుకొని కార్పొరేటర్ లతో సమావేశం అయ్యారు.

సమావేశంలో హాజరైన కార్పొరేటర్లు అందరం మీ వెంటే ఉంటామని భరోసా ఇచ్చారు. అయితే టిఆర్ఎస్ నుండి ఇంకొంతమంది తాజా మాజీ నాయకులు, కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి చేరే అవకాశం ఉందని సమాచారం. గతంలో కమ్యూనిస్టుల కంచుకోటగా చెప్పుకుంటున్న ఖమ్మంలో కాంగ్రెస్ బలమైన పార్టీగా ఉంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాజకీయాలలో అనేక మార్పులు సంభవించాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పదిన తర్వాత కాంగ్రెస్ నుండి గెలిచిన అభ్యర్థులు టిఆర్ఎస్ లో చేరడంతో టిఆర్ఎస్ బలమైన రాజకీయ వ్యవస్థగా ఎదిగింది. ప్రస్తుతం మారుతున్న రాజకీయాల నేపథ్యంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీనే ప్రజలు ఇవ్వనున్నారు అనేది స్పష్టంగా తెలుస్తోంది.

బిఆర్ఎస్ ప్రభుత్వంలో బీసిలు నిర్లక్ష్యాన్ని గురయ్యారని ముఖ్యమంత్రి కేసీఆర్ వారి అభ్యున్నతికి చేసింది ఏమీ లేదని బిఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో నియంత పోకడలతోనే కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ పాలనలోనే అన్ని వర్గాలకు సామాన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ నియంత్రత్వ పోకడలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని కాంగ్రెస్కు పట్టం కట్టడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పై ఉన్న నమ్మకంతో మరి కొంతమంది కాంగ్రెస్ లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వారు త్వరలో కాంగ్రెస్లోకి రానున్నారని తెలిపారు.

Related posts

కరోనాను ఆపాలంటే సామాజిక దూరాన్ని పాటించండి

Satyam NEWS

Thank God: కులం రంగు పులిమే అవకాశం రాలేదు

Satyam NEWS

రుజువులు ఎక్కడ తేను

Satyam NEWS

Leave a Comment