28.7 C
Hyderabad
May 6, 2024 02: 52 AM
Slider ముఖ్యంశాలు

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి

#uttam

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గం లోని వేపల సింగారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ లక్ష రూపాయల ఋణమాఫీ,పంటల భీమా పథకం హామీలను బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.10 ఎకరాలు పైబడి ఉన్న రైతులకు బిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు బకాయిలు చెల్లించకపోవడం విచారకరమని, అట్టి బకాయిలు తక్షణమే చెల్లించాలని అన్నారు.

తెలంగాణ రైతాంగానికి కెసిఆర్ ఉచితంగా ఎరువులు ఇస్తామన్న హామీని పూర్తిగా మరిచిపోయారని,2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని పార్లమెంటులో మోదీ పదేపదే హామీలు ఇచ్చినా అవి నేటికీ నెరవేరలేదని అన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

భావి భారత పౌరులకు అంబేద్కర్ ఆదర్శం

Sub Editor

ట్రాజెడీ: క్రైమ్ రిపోర్టర్ గడ్డం శ్రీనివాస్ ఆకస్మిక మృతి

Satyam NEWS

కురుగంటి చారిటబుల్ ట్రస్ట్ వారి 25 వ వార్షికోత్సవం

Satyam NEWS

Leave a Comment