29.7 C
Hyderabad
May 2, 2024 04: 00 AM
Slider ప్రత్యేకం

మహిళా ఎస్సై శిరీషకు డిజిపి డిస్క్ అవార్డు ప్రదానం

#SISireesha

అనాథ మృతదేహాన్ని ముట్టుకోవడానికి కూడా ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో మహిళా ఎస్సై శిరీష చేసిన సాహస కృత్యాన్ని ఏపి డిజిపి మెచ్చుకున్నారు.

శిరీషకు ఊహించని బహుమతిని డీజీపీ ఇచ్చారు. ఆమెకు డిస్క్ అవార్డును అందించి డ్యూటీతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా ఉండాలని ప్రోత్సహించారు.

అవార్డుతో పాటు ప్రశంశా పత్రాన్ని గౌతమ్ సవాంగ్ అందజేశారు. పోలీసు శాఖలో ఉన్న మానవత్వాన్ని తన విధి నిర్వహణతో శిరీష చాటి చెప్పారని ఆయన ప్రశంసించారు.

పోలీసుల విధి నిర్వహణలో సేవాకార్యక్రమాలు కూడా ఓ భాగమన్నారు. పోలీసుల సేవానిరతిని ఎస్సై శిరీష ప్రత్యక్షంగా చూపించారన్నారు.

ఇదే సమయంలో తనకు అవార్డు రావడం పట్ల కాశీబుగ్గ ఎస్సై శిరీష స్పందించారు. ’నాకు అవార్డు’ రావడం సంతోషంగా ఉంది.

ఖాకీ డ్రస్ చాలా మంది వేసుకుంటారు కానీ ప్రజలకు సేవ చేసేది మాత్రం పోలీసులే అని ఆమె అన్నారు. నా తలిదండ్రులు నాకు నేర్పిన సేవాభావం ఈరోజు నాకు ఈ అవార్డు తెచ్చిపెట్టింది.

డీజీపీ తోపాటు నాకు అభినందనలు తెలిపిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నా. అంటూ శిరీష వ్యాఖ్యానించారు.

Related posts

సబ్ ప్లాన్ నిధులు ఎస్సీ ఎస్టీల కోసమే ఖర్చు చేయాలి

Satyam NEWS

బేగంపేట ఎయిర్ పోర్ట్ లో మొక్కలు నాటిన అమీర్ ఖాన్

Satyam NEWS

సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను తనిఖీ చేసిన వనపర్తి జిల్లా ఎస్పీ

Satyam NEWS

Leave a Comment