39.2 C
Hyderabad
May 3, 2024 12: 10 PM
Slider విశాఖపట్నం

రాష్ట్రంలో విస్తరిస్తున్న రుతుపవనాలు

#rains

రాష్ట్రమంతటా రుతుపవనాలు విస్తరించినట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశాకు ఆనుకుని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. రుతుపవనాల విస్తరణకు ఉపరితల ఆవర్తనం దోహదపడ్డది. దీనితో ఏపి అంతటా ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఏపీతో పాటు పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతం అంతటా, తెలంగాణ, ఒడిశాతోపాటు పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌, బిహార్‌లో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరణ జరిగింది. దీని ప్రభావంతో రానున్న 48గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి.

నేడు మన్యం, అనకాపల్లి, అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు,కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే విధంగా రుతుపవనాల విస్తరణతో మరో రెండు, మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Related posts

కాంగ్రెస్‌లోకి మళ్లీ వచ్చేస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి

Satyam NEWS

నెల్లూరు జిల్లాలో వైసీపీపై మరో ఎమ్మెల్యే అసంతృప్తి గళం

Satyam NEWS

త‌ప్పిపోయిన అయిదేళ్ల బాలుడు….మూడు గంట‌ల్లో అమ్మ ఒడికి

Satyam NEWS

Leave a Comment