విద్యార్థులలో ప్రయోగ నైపుణ్యాలను పెంపొందించుటకు జాతీయ అన్వేషిక నెట్వర్క్ ఆఫ్ ఇండియా వారు జాతీయ అన్వేషిక ప్రయోగాల నైపుణ్య పరీక్ష (NAEST)ఆన్లైన్లో సెప్టెంబర్ 20వ తేదీన నిర్వహిస్తున్నారని జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
నాగర్ కర్నూలు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలో చదువుతున్న 9వ,10వ తరగతి విద్యార్థులు మరియు ఇంటర్, డిగ్రీ, పీజీ సైన్స్ గ్రూప్ విద్యార్థులు కూడా ఈ పరీక్షకు అర్హులు అన్నారు.
ఈ పరీక్ష మూడు అంచెల వారీగా నిర్వహించ బడుతుందని మొదటి స్క్రీనింగ్ రెండవ ప్రిలిమ్స్ మూడవ ఫైనల్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఈ నెల 1వ తేదీ నుండి ప్రారంభమయ్యాయని 18 సెప్టెంబర్ వరకు గడువు ఉంటుందని తెలిాపారు.
ఆలోపు ఈ క్రింద తెలిపిన లింకులో నమోదు చేసుకోవాలన్నారు.
విద్యార్థులు అధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు సైన్స్ ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. మరిన్ని వివరములకు జిల్లా సైన్స్ అధికారి కృష్ణా రెడ్డి (9989921105)ని సంప్రదించాలని కోరారు.