సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపినందుకు యూపీలోని అలీఘర్ నగరంలో అరవై మందికి పైగా మహిళలపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అలీఘర్ సర్కిల్ ఆఫీసర్ అనిల్ సమానియా మాట్లాడుతూ, కొంతమంది మహిళలు సీఏఏ, ఎన్‌ఆర్సీకి వ్యతిరేకంగా సెక్షన్ 144ను ఉల్లంఘిస్తూ అలీఘర్ నగరంలో నిరసన తెలపడానికి ప్రయత్నించారు.
నిరసన తెలిపిన మహిళలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసామని అన్నారు. అలాగే ఈ మహిళలను గుర్తించే ప్రక్రియను ప్రారంభిస్తున్నామని తెలిపారు