40.2 C
Hyderabad
May 2, 2024 18: 18 PM
Slider సంపాదకీయం

ఏప్రిల్‌ 11: జగన్ మంత్రివర్గం పునర్వవస్థీకరణకు ముహూర్తం ఫిక్స్

#CM Jagan

చాలా కాలంగా ఊహాగానాలు సాగుతున్న జగన్ మంత్రివర్గం పునర్వవస్థీకరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఏప్రిల్ 11న మంత్రివర్గ పునర్వవస్థీకరణ జరగబోతున్నది. పాలనాపరంగా ఇప్పటికే పలు సమస్యల మధ్య చిక్కుకుని ఉన్న జగన్ ప్రభుత్వం ఇప్పుడు రాజకీయంగా కూడా కొత్త సమస్యను తలకెత్తుకోబోతున్నది.

ఇప్పటి వరకూ పాలనాపరమైన సమస్యలు మాత్రమే ఉండటంతో వైసీపీ నాయకులు సంతోషంగానే ఉన్నారు. ఇప్పుడు సమయం కూడా ఎక్కువ లేనందున అందరిలో ఆశలు పెరిగిపోయాయి. అందరూ మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఈ సమయంలో మంత్రి వర్గం ఎలా ఉంటుంది? ఎవరితో ఉంటుందనే అంశంపై వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

మంత్రి పదవులు ఆశించి రాని వారు ఏ విధంగా ప్రవర్తిస్తారనేది ఇప్పటికి ప్రశ్నార్ధకంగానే ఉంది. పార్టీపైన విపరీతమైన పట్టు ఉన్న జగన్ బృందానికి మంత్రి వర్గ విస్తరణ తర్వాత కూడా అసమ్మతిని అణచివేయడం పెద్ద సమస్య కాదని అందరూ అంటున్నా ఏం జరుగుతుందోననే ఆసక్తి మాత్రం నెలకొని ఉంది.

ప్రస్తుత మంత్రులు సామాజిక సమీకరణాల కారణంగా నలుగురైదుగురు మినహా మిగిలిన వారిని తప్పించాల్సి ఉంటుందని సీఎం జగన్ నేరుగా కేబినెట్ సమావేశంలోనే స్పష్టం చేసారు. ప్రస్తుతం కొనసాగుతున్న కేబినెట్ కూర్పు సమయంలోనే జగన్ ఒక క్లారిటీ ఇచ్చారు.

రెండున్నరేళ్ల తరువాత ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో 90 శాతం వరకు మార్పు ఉంటుందని నాడే స్పష్టంగా చెప్పారు. ప్రస్తుతం మంత్రులుగా ఉంటూ.. తప్పించాలని భావిస్తున్న వారితో నేరుగా..వారు ఎక్కడా హర్ట్ కాకుండా…వారితో స్వయంగా తన నిర్ణయం గురించి వివరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. శ్రీకాకుళం నుంచి ప్రస్తుతం మంత్రులుగా ఉన్న ధర్మాన క్రిష్ణదాస్, సిదిరి అప్పలరాజు ను తప్పించనున్నట్లు సమాచారం.

ధర్మాన క్రిష్ణదాస్ ను తప్పించి ఆయన స్థానంలో సోదరుడు ధర్మాన ప్రసాద రావును కేబినెట్ లోకి తీసుకోనున్నారు. అదే విధంగా అదే జిల్లా నుంచి స్పీకర్ గా కొనసాగుతున్న తమ్మినేని సీతారాం ను సైతం కేబినెట్ లోకి తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయన స్థానంలో విజయనగరం జిల్లా ఎస్టీ వర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యే పీ రాజన్నదొరను స్పీకర్ గా చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

ఇప్పటి వరకు ఎస్టీ వర్గానికి స్పీకర్ హోదా దక్కలేదు. చివరి నిమిషంలో మార్పులు చేర్పులు జరిగితే తప్ప స్పీకర్ గా రాజన్న దొర నియామకం ఖాయంగా కనిపిస్తోంది. ఇక, సీనియర్లలో బొత్సా, కొడాలి నాని సైతం కేబినెట్ నుంచి తప్పుకోనున్నారని విశ్వసనీయ సమాచారం.

వారితో పాటుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని సీఎం ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. అయితే, పెద్దిరెడ్డి విషయంలో ఇంకా తుది నిర్ణయం జరగలేదు. కొడాలి నాని స్థానంలో కమ్మ వర్గం నుంచి ఎమ్మెల్సీ తలశిల రఘురాం లేదా వసంత క్రిష్ణ ప్రసాద్ కు కేబినెట్ లో అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తోంది.

హోం మంత్రి సుచరిత స్థానంలో మరో మహిళకు ఆ పదవి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సారి బీసీ మహిళకు హోం మంత్రి పదవి ఇవ్వాలనే సమీకరణం పైన ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత మంత్రుల్లో పేర్ని నాని, కన్నబాబు తో పాటుగా

బుగ్గన రాజేంద్రనాధ్ కేబినెట్ లో కొనసాగటం ఖాయమని తెలుస్తోంది. కొత్త జిల్లాలు అందుబాటులోకి వస్తుండటంతో పక్కాగా సామాజిక – ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా కేబినెట్ కూర్పు  జరగనుంది.

సామాజిక వర్గాల వారీగా మంత్రీ పదవుల రేసులో ఉన్న వారు:

ఎస్టి సామాజిక వర్గం నుండి.

1)పెడిక రాజన్న దొర,

2)తెల్లం బాలరాజు

3)కొట్టు భాగ్యలక్ష్మి

4)చెట్టి పాల్గుణ

ఎస్సీ సామాజిక వర్గం నుండి.

1)పండుల రవీంద్ర బాబు

2)గొల్ల బాబురావు

3)తలారి వెంకట్రావు

4)మేరుగు నాగార్జున

5)వరప్రసాద రావు

6)కోరుముట్ల శ్రీనివాస్

7)తోగురు అర్థర్

కాపు సామాజిక వర్గం నుండి.

1)దాడిశెట్టి రాజా

2)జక్కంపూడి రాజా

3)గ్రంధి శ్రీనివాస్

4)సామినేని ఉదయభాను

5)అంబటి రాంబాబు

6)తోట త్రిమూర్తులు

బీసీ సామాజిక వర్గం నుండి.

1)కొలుసు పార్థసారథి

2)ధర్మాన ప్రసాదరావు

3)తమ్మినేని సీతారాం

4)జోగి రమేష్,

5)పొన్నాడ సతీష్

6)కారుమూరి వెంకట

7)రమణ నాగేశ్వరావు,

మైనార్టీ సామాజిక వర్గం నుండి.

1)హాఫీజ్ ఖాన్,

2)రుహుల్ల

క్షత్రియ సామాజిక వర్గం నుండి.

1)ముదునూరి ప్రసాద్ రాజు

మహిళల నుండి

1)రెడ్డి శాంతి

2)ఆర్ కే రోజా రెడ్డి

3)విడుదల రజిని

4)జొన్నలగడ్డ పద్మావతి

5)విశ్వాసరాయి కళావతి

6)ఉషశ్రీ శరణ్

7మేకపాటి గౌతమ్ రెడ్డి (భార్య లత)

రెడ్డి సామాజిక వర్గం నుండి.

1)ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి

2)గండికోట శ్రీకాంత్ రెడ్డి

3)నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి

4)భూమన కరుణాకర్ రెడ్డి

5)కాకాని గోవర్ధన్ రెడ్డి

6)కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

7)అనంత వెంకట రామిరెడ్డి

8)తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

9)చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

10)ఆళ్ల రామకృష్ణారెడ్డి

11)పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

12)రాంభూపాల్ రెడ్డి.

Related posts

ఆంధ్రప్రదేశ్ సిఎం వై ఎస్ జగన్ ఏమన్నారంటే

Satyam NEWS

రేపటి నుంచి తెలంగాణలో లాక్ డౌన్ పాక్షిక సడలింపు

Satyam NEWS

ప్రకాశం జిల్లా పోలీస్ స్పందన కార్యక్రమంకు 107 ఫిర్యాదులు

Satyam NEWS

Leave a Comment