35.2 C
Hyderabad
April 27, 2024 12: 10 PM
Slider కడప

జనావాసాల్లోకి వన్య ప్రాణులు

#forest

కడప జిల్లా నందలూరు మండలంలోని సమీప అటవీ ప్రాంతంనుంచి నారాయణరాజు పేట గ్రామంలో శనివారం దుప్పిని కుక్కలు వేటాడుతుండగా స్థానికులు రక్షించారు. సమీప అటవీ ప్రాంతంలో ఇటీవల బొగ్గుల కోసం,బోధ కోసం కొందరు నిప్పు పెడుతున్నారు.వన్య ప్రాణులు మంటల భారీన పడుతున్నాయి. అంతే కాకుండా ఎండల వేడి కూడా అధికం అయ్యింది .అడవిలో త్రాగునీరు కొరత ఏర్పడింది.

ఇందుకోసం అటవీశాఖ అధికారులు తగు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీనితో వన్య ప్రాణులు కాకవికలం అయ్యి గ్రామాల్లో కి వస్తున్నాయి. అలా గ్రామంలో కి వచ్చిన జింకను కుక్కల భారీ నుంచి రక్షించిన గ్రామస్తులు దాన్ని చెట్టుకు కట్టి దాహార్తి తీర్చి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు దాని జీపులో తరలించి అడవిలో వదిలారు. ఇప్పటికయినా అధికారులు వన్యప్రాణుల సంరక్షణ కోసం తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Related posts

Heavy Rains: అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకండి

Satyam NEWS

పశువుల పునరుత్పత్తి శిబిరాలను వినియోగించుకోవాలి

Satyam NEWS

Analysis: ఆగుతున్న శ్వాసను నిలబెట్టే ఆశ

Satyam NEWS

Leave a Comment