31.2 C
Hyderabad
May 3, 2024 02: 40 AM
Slider ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాలి హైకోర్టు

ap hicourt

ప్రజలకు ఇబ్బంది లేకుండా స్థానిక ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు గురువారం ప్రభుత్వాన్నిఆదేశించింది. కరోనా పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమీషనర్‌కు సహకరించడం లేదు. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ హైకోర్టును ఆశ్రయించారు. తొలుత ఎన్నికల నిర్వహణపై స్టే ఇచ్చిన హైకోర్టు ఈ రోజు ఎన్నికలను నిర్వహించాలని ఆదేశించింది. ఎన్నికల కమీషనర్‌ ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకారం ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ నిర్ణయం తీసుకుందని, దాని ప్రకారం ఎన్నికలు జరగాలని ఆదేశించింది. రాజ్యాంగ వ్యవస్థల స్వతంత్య్రాన్ని హరించే శక్తి ఎవ్వరికి లేదని, ఒక వ్యవస్థ మరో వ్యవస్థ సమన్వయంతో పనిచేయాలి కాని చొరబడకూడదని సూచించింది. అలా బలవంతంగా చొరబడితే రాజ్యాంగం ద్వారా నిర్మితమైన స్వతంత్య్ర న్యాయవ్యవస్థ సరి చేస్తుందని స్ప‌ష్టం చేసింది.

Related posts

సూర్యాపేట జిల్లాలో బర్డ్ ఫ్లూపై చెలరేగుతున్న భయాందోళన

Satyam NEWS

గుడ్ న్యూస్: మోడీ స‌ర్కారు సంస్క‌ర‌ణ‌లకు సాహో!

Satyam NEWS

కేంద్రం నిధులు ఇచ్చినా వాడుకోని ప్రభుత్వం ఇది

Satyam NEWS

Leave a Comment