30.3 C
Hyderabad
March 15, 2025 09: 13 AM
Slider ఆధ్యాత్మికం

కనకదుర్గ అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు సిద్ధం

#Kanakadurga Temple

దుర్గమ్మ దర్శనం ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న భక్తులకు శుభవార్త. కరోనా నిబంధనలు పాటిస్తూ అమ్మవారి దర్శనం చేసుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయానికి భక్తులు దర్శనానికి వచ్చే సమయంలో కచ్చితంగా  నియమనిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే టిక్కెట్లను ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఎమ్మెస్ ద్వారా టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేశారు. 24 గంటల ముందుగానే స్లాట్ బుక్ చేసుకునేలా ఏర్పాట్లను దేవస్థానం అధికారులు చేశారు.

ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. గంటకు 250 మంది భక్తులకు మించకుండా దర్శనం కలిగించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆధార్ నెంబర్‌తో సహా దర్శన సమయాన్ని ఎస్ఎమ్మెస్‌లలో  భక్తులకు సమాచారం అందిస్తారు. అంతరాలయ దర్శనం, శఠగోపం, తీర్థం పంపిణి నిలిపి వేస్తూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Related posts

సోమశిల అర్బన్ ఫారెస్టు పార్క్ పనులు మరింత వేగవంతం

Satyam NEWS

ఘనంగా బలగం టీమ్ కి ఉగాది నంది పురస్కారాలు

Satyam NEWS

రోజుకు 80 వేల మందికి వైకుంఠ ద్వార దర్శనం

Murali Krishna

Leave a Comment