28.2 C
Hyderabad
April 30, 2025 06: 20 AM
Slider నల్గొండ

బాధలు అర్ధం చేసుకుని ఏపీ పోలీసులు సహకరించాలి

#SP Ranganath

కరోనా కష్టాలతో ఇబ్బందులు పడుతూ లాక్ డౌన్ కష్టాలను ఎదుర్కొంటూ వారంతా ఎక్కడెక్కడి నుండో స్వంత రాష్ట్రానికి వెళ్ళడానికి తాము బయలుదేరిన ప్రాంతం నుండి అనుమతులు తీసుకొని బయలుదేరి వచ్చారు….. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనుమతించకపోవడంతో తెలంగాణ సరిహద్దులలో చిక్కుకుపోయారు…..

స్వంత రాష్ట్రానికి అనుమతి లేక వచ్చిన ప్రాంతానికి తిరిగి వెళ్లే పరిస్థితి లేక తిండి తిప్పలు లేక రోజుల తరబడి అనేక అవస్థలు పడుతున్నారు…. వారిని స్వస్థలాలకు పంపేందుకు చొరవ తీసుకొని ఆంధ్రా అధికారులతో మాట్లాడి అనుమతించేలా కృషి చేసి మరోసారి మానవత్వాన్ని ప్రదర్శించారు నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాధ్.

నాలుగు రోజులుగా సరిహద్దుల వద్ద ఇబ్బంది పడుతున్న కూలీలు

నల్లగొండ జిల్లా వాడపల్లి వద్ద తెలంగాణ – ఆంధ్రా సరిహద్దుల వద్ద గత మూడు, నాలుగు రోజులుగా ఆంధ్రా అధికారుల అనుమతి కోసం ఎదురుచూపులు చూస్తూ తిండి తిప్పలు లేక అవస్థలు పడుతున్న ప్రజలు, ప్రయాణీకుల బాధలను తీర్చేందుకు నిరంతరాయంగా కృషి చేస్తున్న నల్లగొండ జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలిసి వాడపల్లి వద్ద పరిస్థితిని సమీక్షించారు.

ఎస్పీ శుక్రవారం ప్రత్యేకంగా చొరవ తీసుకొని పొందుగుల చెక్ పోస్ట్ వద్దకు వెళ్లి ఆంధ్రా అధికారులతో పరిస్థితిని వివరించడంతో పాటు గుంటూరు ఐ.జి., ఎస్పీలతో సైతం ఫోన్ లో మాట్లాడి వాడపల్లి వద్ద పడిగాపులు పడుతున్న ప్రయాణికుల బాధలను వారికి తెలిపారు.

ఏపీ పోలీసులూ సహకరించండి

విపత్కర పరిస్థితులలో మానవత్వంతో వ్యవహరించాలని ఆంధ్రా పోలీస్ అధికారులను కోరారు. లాక్ డౌన్ కారణంగా ఎలాంటి సౌకర్యాలు లేక, తిండి దొరకక ప్రయాణికులు, వలస కార్మికులు పడుతున్న బాధలను అర్దం చేసుకోవాలని వారికి సూచించారు ఎస్పీ రంగనాధ్.

వాడపల్లి సరిహద్దు వద్ద ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను తీర్చడం కోసం నిరంతరాయంగా కృషి చేస్తున్న జిల్లా ఎస్పీ రంగనాధ్ శుక్రవారం ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఆంధ్రా అధికారులతో మాట్లాడి అనుమతించాలని కోరడం, ఆంధ్రా పోలీసులు కొంత సానుకూలంగా స్పందించడం పట్ల వాడపల్లి వద్ద పడిగాపులు పడుతున్న ప్రజలు, ప్రయాణీకులు ఎస్పీ రంగనాధ్ చొరవ, మానవత్వాన్ని అభినందించి నల్లగొండ పోలీసుల కృషిని ప్రశంసించారు.

తమకు అల్పాహారం, భోజనం అందించడంతో పాటు స్వస్థలాలకు చేర్చడానికి చేసిన కృషిని ఎన్నటికీ మర్చిపోలేమని నల్లగొండ పోలీసులకు జేజేలు పలికారు. వారి వెంట మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్, డిఎస్పీ వెంకటేశ్వర్ రావు, రూరల్ సిఐ రమేష్ బాబు, పలువురు పోలీస్ అధికారులున్నారు.

Related posts

ప్రజా సమస్యల పరిష్కారం కై సిపిఐ మౌన దీక్షలు

Satyam NEWS

కర్నాటక ఫలితాలతో అధికార వైసీపీలో పెరిగిన గుబులు

Satyam NEWS

ఆర్ఎస్ఎస్ కు అంతర్జాతీయ నిధులపై పాకిస్తాన్ ఆందోళన

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!