40.2 C
Hyderabad
April 28, 2024 18: 40 PM
Slider నల్గొండ

సిఎంఆర్ చెక్కులను పంపిణీ చేసిన శాసనసభ్యుడు సైదిరెడ్డి

#saidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం లోని నేరేడుచర్ల రూరల్,నేరేడుచర్ల మునిసిపాలిటీ, పాలకీడు మండలాల లోని వారికి సిఎంఆర్ చెక్కులను స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి పంపిణీ చేశారు.

నేరేడుచర్ల రూరల్ 22 చెక్కులు 6,12,700 రూపాయలు,నేరేడుచర్ల మునిసిపాలిటీ 4 చెక్కులు 2,18,000 రూపాయలు,పాలకీడు 15 చెక్కులకు గాను 5,55,000 ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా శాసనసభ్యుడు సైదిరెడ్డి మాట్లాడుతూ ప్రయివేటు వైద్యశాలల మోజులో పడి ప్రజలు ఆర్ధికంగా నష్టపోవొద్దని అన్నారు.

నియోజవర్గంలో ప్రతి రెండు నెలలకు సుమారుగా 2 నుండి 3 కోట్ల రూపాయల సిఎంఆర్ చెక్కులు పంచుతున్నామని,ప్రయివేటు వైద్యశాలల మాయ జాలంలో పడి మోసపోవొద్దని అన్నారు.హుజుర్ నగర్ నియోజకవర్గం లోని అన్ని ప్రభుత్వ వైద్యశాలలలో గైనకాజి,స్పెషలిస్టులను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.

వైద్యం అత్యవరం అయిన వారికి సూర్యపేట ప్రభుత్వ వైద్యశాల వారితో మాట్లాడి మెరుగైన వైద్యం అందించటానికి దోహదపడతానని అన్నారు.అంతే కాకుండా నిమ్స్ వైద్యశాలలో వైద్యానికి ఎల్ ఓ సి లను కూడా ముందే తెప్పించి ఖరీదు అయిన వైద్యం చేయించుతున్నట్లు తెలిపారు.

పేద ప్రజలు ఎవ్వరికైనా కుడా ఏ ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం చేయించటానికి తాను అన్నివేళలా సిద్దంగా ఉన్నానని అన్నారు.

ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల  మున్సిపాలిటీ టౌన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్లా శ్రీలత రెడ్డి,మునిసిపల్ చైర్మెన్ జయబాబు,మార్కెట్ చైర్మెన్ యశోధరాములు,నేరేడుచర్ల రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు సురేష్ బాబు జెడ్ పి టి సి రాపోలు నర్సయ్య,వైస్ ఎంపీపీ తాళ్లూరి లక్ష్మీనారాయణ, సింగిల్ విండో చెర్మెన్ అప్పిరెడ్డి, పాలకీడు మండల పార్టీ అధ్యక్షుడు అంజిరెడ్డి,మాజీ పార్టీ అధ్యక్షుడు దర్గారావు,వైస్ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవి,పిఏసిఎస్ చైర్మెన్ సత్యనారాయణ రెడ్డి, గ్రామ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

షూటింగ్ మొదలు పెట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు

Satyam NEWS

ఇతర రాష్ట్రాలకు ఆర్టీసీ కార్గో పార్సిల్, కొరియర్ సేవలు

Satyam NEWS

25న సీఎం జగన్ బెయిల్ రద్దు: బిజెపి నేత కామెంట్ తో సంచలనం

Satyam NEWS

Leave a Comment