30.2 C
Hyderabad
September 14, 2024 15: 59 PM
Slider ముఖ్యంశాలు

కొత్త రేషన్ కార్డులు, పింఛన్ల కోసం 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ

#revanthreddy

ఏళ్లుగా గంపెడాశలతో ఎదురుచూస్తున్న పేదల కల తీరబోతోంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్తగా కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 28 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. దీంతో పాటు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులూ, తప్పులు సరిచేయడం తదితర అంశాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 28 నుంచి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తామని, కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, హౌసింగ్‌పై గ్రామ సభలో నిర్ణయం మేరకు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేషన్ దుకాణాల్లో పంపిణీ చేసే బియ్యం పక్కదారి పట్టకుండా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చారు.

Related posts

కియా సంస్థకు ప్రభుత్వం పూర్తి అండదండ ఉంటుంది

Satyam NEWS

ఘనంగా లంబాడీల ఆరాధ్యదైవం శీతల పండుగ

Satyam NEWS

పెన్షన్లు తక్షణమే పంపిణీ చేయండి

Satyam NEWS

Leave a Comment