42.2 C
Hyderabad
May 3, 2024 16: 30 PM
Slider ప్రత్యేకం

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ప్రవేశం కోసం దరఖాస్తులు

#airforce

భారత వైమానిక దళంలో ఉద్యోగ అవకాశాల కొరకు నోటిఫికేషన్ జారీచేయడం జరిగింది.  అర్హత గల విద్యార్థులు ఈ నెల 23వ తేదీ లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు  చేసుకోవాలి . ధరఖాస్తూ చేసుకొనుటకు, ఇతర వివరాలకు https://agnipathvayu.cdac.in వెబ్ సైట్ ను సందర్శించగలరు. దరఖాస్తు చేసుకున్న వారికి  18-01-2023 నుండి 24-01-2023 వరకు ఆన్ లైన్ లో పరీక్ష  నిర్వహించబడును. అభ్యర్ధులు 17 నుండి 21 సంII లు వయసు వారు అర్హులు .  ఇంటర్మీడియట్ 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంగ్లిష్  సబ్జెక్టు నందు కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి.  ఎత్తు అబ్బాయిలు కనీసం 152 .5 సెంటీ మీటర్స్ ,  అమ్మాయిలు కనీసం 152 సెంటీ మీటర్స్  ఉండాలి.  ఎత్తుకు తగ్గ బరువు కలిగి ఉండవలెను. ఛాతి కనీసం 77 సెంటీ మీటర్ లు  కలిగి ఉండి, గాలి పీల్చినప్పుడు 05 సెంటీ మీటర్ లు పెరగవలెను. అర్హతలు కలిగి ఉన్న యువతీయువకులు భారత వైమానికి దళంలో చేరుటకు  250/- ల ఫీజు ఆన్ లైన్ లో చెల్లించి https://agnipathvayu.cdac.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Related posts

కేసీఆర్ ఎంత మొత్తుకున్నా పీవీ మావాడే

Satyam NEWS

రాజకీయాన్ని వ్యాపారం చేయడాన్ని ముక్తకంఠంతో ఖండించాలి…!

Bhavani

కరోనా నియంత్రణకు పటిష్ఠ చర్యలు

Satyam NEWS

Leave a Comment