రాష్ట్ర వ్యాప్తంగా 25 దేవాలయాలకు పాలక మండళ్లను ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1 కోటి నుంచి 5 కోట్లు వార్షిక ఆదాయం ఉన్న అన్ని దేవాలయాలకు, ట్రస్టులకు పాలక మండళ్లను ఏర్పాటు చేసేందుకు వీలుకలుగుతుంది. శ్రీకాకుళంలోని అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం, మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, అంతర్వేది, అమరావతిలోని అమరేశ్వరస్వామి ఆలయం, పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం తదితర ఆలయాలకు ఇక ట్రస్టు బోర్డులు ఏర్పాటు అవుతాయి. హిందూ ధార్మిక సంస్థలు, ట్రస్టుల చట్టం 1987 సవరణ చట్టం ప్రకారం పాలక మండళ్లను ఏర్పాటు చేస్తున్నారు.
previous post