24.7 C
Hyderabad
March 26, 2025 10: 05 AM
Slider కరీంనగర్

రోడ్డు పైకి రావద్దన్నందుకు కలెక్టర్ తోనే వాగ్వాదం

collector 23

సిరిసిల్ల పట్టణంలోని గాంధీ కూడలి ప్రధాన రోడ్డు మార్గంలో రోడ్లపై ఒకరికి మించి వాహనాలు కార్లో వెళుతున్న వ్యక్తులకు జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ రోడ్లపైనే కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రభుత్వం ప్రకటించినందున ప్రజలు రోడ్లపైకి రావద్దని కూడా వద్దని కోరారు.

ఈ క్రమంలో తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామానికి చెందిన గుగ్గిళ్ళ శ్రీకాంత్ జిల్లా కలెక్టర్ పోలీస్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ప్రజా శ్రేయస్సు కాంక్షించి ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా వైరస్ కట్టడికి జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు.

అయినప్పటికీ శ్రీకాంత్ జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులతో వాగ్వాదాన్ని కొనసాగించారు. దాంతో అతడిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ తరలించారు. కరోనా ఉధృతిని దానివల్ల కలిగే ప్రాణనష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తెలంగాణ రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ స్వేచ్ఛగా బాధ్యత లేకుండా ప్రజలు రోడ్లపైకి రావడం ఏమిటని కలెక్టర్ ప్రశ్నించారు.

ప్రభుత్వం కరోనా మహమ్మారిపై సమరభేరి మోగించి ఉంటే మీరు మీ పాటికి ఇష్టారీతిన వ్యవహరిస్తారా ఇలాగైతే కరోనా వైరస్ కట్టడి ఎలా సాధ్యమవుతుంది అని కలెక్టర్ ప్రశ్నించారు. మీ లాంటి వ్యక్తుల వల్లే ఇటలీలో వేలాది ప్రాణాలు పోయాయని కలెక్టర్ తెలిపారు.

ఇలాగే నిర్లక్ష్యం చేస్తే జిల్లా జిల్లాలో ప్రజలు ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. అస్తవ్యస్త పరిస్థితులు తలెత్తుతాయి అన్నారు. శాంతిభద్రతలు ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. నిర్లక్ష్యం వల్ల మీ ప్రాణాలు పోవడమే కాకుండా జిల్లా మొత్తం ప్రమాదంలో పడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

ఇక నుంచైనా బాధ్యతగా వ్యవహరించి కరోనా కట్టడికి ప్రభుత్వానికి ,జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ హితోపదేశం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మొదటి తప్పుగా భావించి ఇంతటితో వదిలేస్తున్నామని, ఇలాంటి తప్పులు మునుముందు పునరావృతమైతే అరెస్టు చేస్తామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య కలెక్టరేట్ అధికారులు సిబ్బంది ఉన్నారు.

Related posts

ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి నిండు ప్రాణాన్ని కాపాడుదాం

mamatha

ఆటో డ్రైవరు నిజాయితీతో బాధితులకు చేరిన బ్యాగులు

Satyam NEWS

పెదకడిమి రావుల చెరువు వేలం పాట వాయిదా

mamatha

Leave a Comment