కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నదిరా వ్యాపారాలు బంద్ చేయండిరా అని చిలక్కు చెప్పినట్లు చెప్పినా ఎవరూ వినడం లేదు. లాక్ డౌన్ అంటే హాలిడే అనుకుంటున్నారు. ఎంజాయ్ చేద్దామనుకుంటున్నారు తప్ప ఇళ్లలో ఉండటం లేదు. బయటకు వస్తే వ్యాధి ప్రబలుతుంది.
ఎవరికి వారు అలా వచ్చి చచ్చిపోతామంటే అభ్యంతరం ఉండకపోవచ్చు కానీ వారి వల్ల సమాజం మొత్తానికి కరోనా ప్రబలుతుంది. మన కోసం, మన సమాజం కోసం నిబంధనలు పాటించాలని కోరుతుంటే ఎవరూ వినడం లేదు. గుంటూరు జల్లా నరసరావుపేట పట్టణం లో ఒక బార్ బయట బంద్ చేసుకుని లోపల దర్జాగా మందు బాబులకు మందు సరఫరా చేస్తున్నది.
లోపల మందుబాబులు తాగి ఊగుతున్నారు. మత్తులో వారు ఎక్కడికి వెళతారో ఎవరిని తాకుతారో వైరస్ వ్యాప్తికి ఎలా సహకరిస్తారో కూడా అర్ధం కాని పరిస్థితి. దీనిపై స్థానిక టూ టౌన్ ఎస్ ఐ రబ్బానీ ఖాన్ కు సమాచారం అందింది. దాంతో ఆయన ఎంతో సాహసంగా కాపు కాచి నరసరావుపేటలోని శ్రీ వేంకటేశ్వర బార్ అండ్ రెస్టారెంట్ లో అక్రమంగా మద్యం అమ్మకాలు చేపడుతూ ఉంటే వారిని చక చక్యంగా పట్టుకున్నారు. బార్ ని సీల్ వేయించి అక్రమ మద్యం అమ్మేవారికి తాగే వారికి టూ టౌన్ ఎస్ ఐ రబ్బానీ ఖాన్ ఈ విధంగా షాక్ ఇచ్చారు.