41.2 C
Hyderabad
May 4, 2024 16: 20 PM
Slider ఖమ్మం

ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు

#dckmm

మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్  పరీక్షలు సాఫీగా, పగడ్బందీగా నిర్వహించాలని   జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.  ఐడిఓసి లోని కాన్ఫరెన్స్ హాల్లో ఇంటర్ మీడియట్ పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,  ఫిబ్రవరి 15 నుండి మార్చి 2 వరకు ప్రాక్టికల్ పరీక్షలు, మార్చి 4వ ఎథిక్స్ ఆండ్ హ్యుమన్ వ్యాల్యుస్, మార్చి 6న ఇన్విరాన్ మెంట్ పరీక్షలు, 15 మార్చి నుండి ఇతర సబ్జెక్టుల పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్ స్టేట్ బోర్డు, హైదరాబాద్ ఆదేశాలను  జారిచేసిన క్రమంలో జిల్లాలో పరీక్షల నిర్వహణకు 63 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఇట్టి కేంద్రాల్లో 17,890 మంది మొదటి, 17,967 రెండవ సంవత్సరం మొత్తంగా 35,857 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పటిష్టమైన ఏర్పాట్లను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రాక్టికల్, థియరీ పరీక్షల ప్రశ్నపత్రాల భద్రపర్చుటకు పటిష్ట ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షలు ముగిసే వరకు పరీక్షా కేంద్రాలకు నిరంతరాయంగా విద్యుత్  చేయాలని, పరీక్షల సమయంలో సమయానికి పరీక్ష  కేంద్రాలకు విద్యార్థులు చేరుకునేలా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ అన్నారు.

పరీక్షా కేంద్రాల్లో సిసి కెమరాలను ఏర్పాటు చేయాలన్నారు.  ప్రతి గదిలో సిసి కెమెరా ల నిఘాలో ఉన్నట్లు స్పష్టంగా ప్రదర్శించాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్, స్మార్ట్ వాచ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలతో అనుమతించకూడదని ఆయన తెలిపారు. త్రాగునీరు, కనీస మౌళిక సదుపాయాల కల్పన చేయాలని, వేసవి దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆయన తెలిపారు. కేంద్రం దగ్గర్లో జిరాక్స్ సెంటర్లు మూసివేయించాలని, 144 సెక్షన్ అమలు చేయాలని ఆయన అన్నారు. కేంద్రం లోపల, పరిసరాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షలు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, జిల్లా రెవిన్యూ అధికారిణి ఆర్. శిరీష, జెడ్పి సిఇఓ వివి. అప్పారావు, జిల్లా ఇంటర్ మీడియట్ అధికారి రవిబాబు, ఎస్బి ఏసిపి డి. ప్రసన్నకుమార్, జిల్లా విద్యాశాఖాధికారి ఇ. సోమశేఖరశర్మ, జిల్లా వైద్యాధికారి డా. బి. మాలతి, ఆర్సీవోలు జ్యోతి, ప్రత్యుష, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మట్టపల్లి శ్రీ లక్ష్మీనృసింహ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం క్యాలెండర్ ఆవిష్కరణ

Satyam NEWS

అనారోగ్య బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి జూపల్లి

Satyam NEWS

కోవిడ్ వేళ పరిమళించిన రోజా దాతృత్వం

Satyam NEWS

Leave a Comment