Slider ఆధ్యాత్మికం

మట్టపల్లి శ్రీ లక్ష్మీనృసింహ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం క్యాలెండర్ ఆవిష్కరణ

#mittapalli

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం లోని పరమ పవిత్ర కృష్ణ నది తీరమందు గుహలో స్వయంగా వెలిసిన శ్రీ లక్ష్మీనృసింహ స్వామి మహా క్షేత్రము నవ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. సుప్రసిద్ధ క్షేత్రం లోని శ్రీ లక్ష్మీనృసింహ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రంలో సోమవారం నూతన ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

గడిచిన 60 సంవత్సరముల నుండి మట్టపల్లి మహా క్షేత్రానికి వచ్చే బ్రాహ్మణ యాత్రికుల,భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన అన్నదాన సత్రం దాతల సహాయ సహకారాలతో నిత్యం అన్నదానం చేస్తూ బ్రాహ్మణ బంధువుల యొక్క ఆదరాభిమానాలను చూరగొంది.శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి దర్శనార్థమై వచ్చే భక్తులకు అన్న ప్రసాదం అందిస్తూ, చతుర్వేద వేద విద్యలకు పెద్దపీట వేసి శ్రీ లక్ష్మీనృసింహ వేద స్మార్త పాఠశాలను ఏర్పాటు చేసి వేద విద్యను అందిస్తున్న ఘనత శ్రీ మట్టపల్లి లక్ష్మీనృసింహ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రానికే దక్కింది.

ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకొని దాతలు కొంకపాక కస్తూరి జ్ఞాపకార్థం భర్త కొంకపాక వేంకటేశ్వర శర్మ,కుమారులు శివవిష్ణువర్ధన్ శర్మ,ధనుజయ శర్మ,తేజోమూర్తుల రవిశర్మ దంపతుల ఆర్థిక,హార్దిక సహాయ సహకారాలతో సోమవారం శ్రీ లక్ష్మీనృసింహ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం ఆవరణలో సత్రం నిర్వహణ కమిటీ సభ్యులు,బ్రాహ్మణ యాత్రికులు,వేద విద్యార్థుల వేదోశ్చరణల మధ్య 2023 నూతన ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ ను అత్యంత ఘనంగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీనృసింహ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం నిర్వహణ కమిటీ ప్రధాన కార్యదర్శి చెన్నూరు మట్టపల్లి రావు,కోశాధికారి బాచిమంచి గిరిబాబు,సభ్యులు భువనగిరి శ్యామ్ సుందర్, ధూళిపాళ రామకృష్ణ ప్రసాద్,రంగరాజు వాసుదేవ రావు,పులిజాల శంకర్రావు,వేద,స్మార్త పండితులు తేజోమూర్తుల రవిశర్మ,మధు, సుబ్బారావు,వేద,స్మార్త పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

యోగాతో ఆరోగ్యం.. ఆనందం

Satyam NEWS

ఓటర్ జాబితా తయారీకి సహకరించాలి

Bhavani

వ్యాసాయ విష్ణు రూపాయ..విజ‌య‌న‌గ‌రంలో వ్యాస భ‌గ‌వానుడు….ఎక్క‌డంటే..?

Satyam NEWS

Leave a Comment