40.2 C
Hyderabad
April 26, 2024 11: 51 AM
Slider వరంగల్

కోవిడ్ నిబంధనలను పాటిస్తూ మల్లన్న ను దర్శించుకుందాం

#warangalpolice

ఐనవోలు మల్లన్న దర్శించుకోనే భక్తులు తప్పని సరిగా కోవిడ్ నిబందనలను పాటించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ భక్తులకు పిలుపునిచ్చారు.  ఈ నెల 14వ తేది నుండి ప్రారంభమయ్యే ఐనవోలు జాతర బందోబస్తు ఏర్పాట్ల పై వరంగల్ పోలీస్ కమిషనర్ బుధవారం  పోలీస్ అధికారులతో ఐనవోలు లో సమీక్షా జరిపారు.

జాతర సందర్బంగా పోలీస్ బందోబస్తు, భక్తుల క్యూలైన్ల నిర్మాణం, సిసి కెమెరాలు, వాహన  పార్కింగ్  స్థలాల ఎర్పాట్లపై పోలీస్  కమిషనర్   పోలీస్ అధికారులతో చర్చించారు. ముఖ్యంగా జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా, జాతరకు వచ్చే మార్గంలో ఏవిధమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన ముందస్తూ చర్యలపై పోలీస్ కమిషనర్ ఈస్ట్  జోన్ డిసిపి వెంకటలక్ష్మి ,  లా అండ్ అర్ఢర్ అదనపు డిసిపి సాయి చైతన్య , మామూనూరు ఏసిపి నరేశ్ కుమార్, పర్వతగిరి సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ విశ్వేశ్వర్, ఎస్.ఐ భరత్ లతో చర్చించడంతో పాటు అధికారులు క్షేత్ర  స్థాయిలో పార్కింగ్ స్థలాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా  పోలీసు కమిషనర్  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జాతర వచ్చే భక్తులు తప్పక కోవిడ్ నిబంధనలు పాటించాలని పోలీస్ కమిషనర్  తెలిపారు. అంతకు మందు  ఐనవోలు దేవాలయానికి చేరుకున్న పోలీస్ కమిషనర్ ను ఆలయ ప్రధాన అర్చకులు, అధికారులు ఆలయ చైర్మెన్  పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం  అర్ఛకులు ప్రత్యేక పూజలు నిర్వహించి  పోలీస్ కమిషనర్ , డిసిపి, అదనపు డిసిపిలకు  అర్ఛకులు దేవుడి శేష వస్ర్తాలు, తీర్థ ప్రసాదాలను అందజేసారు.

Related posts

సిరిమానోత్సవం:  కంట్రోల్ రూమ్ నుండి ఎస్పీతో పర్యవేక్షించిన కలెక్టర్

Satyam NEWS

పోలీసుల తీరుపై జడ్జి రామకృష్ణ పీఎస్‌లో ఫిర్యాదు

Satyam NEWS

హూదూద్ లబ్ధి దారులు కి ఇండ్లను అప్ప చెప్పాలంటున్న సీపీఎం

Satyam NEWS

Leave a Comment