29.7 C
Hyderabad
April 29, 2024 10: 38 AM
Slider విజయనగరం

సిరిమానోత్సవం:  కంట్రోల్ రూమ్ నుండి ఎస్పీతో పర్యవేక్షించిన కలెక్టర్

#surya

విజయనగరం పైడితల్లి సిరిమానో త్సవం సందర్బంగా పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర   మంత్రులు బొత్స సత్యనారాయణ,బూడి ముత్యాల నాయుడు,    కొట్టు సత్యనారాయణ ,  స్పీకర్ తమ్మినేని సీతారాం,  డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్ర శేఖర్, జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాస రావు, నగర మేయర్ విజయలక్ష్మి ,  శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు అమ్మవారిని దర్శించుకున్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా హాజరై ప్రజాప్రతినిధుల దర్శనాలను చేయించారు.

ఉదయం నుండి గుడి వద్దనే ఉంటూ దర్శనాలను క్రమబద్ధంగా జరిగేలా ఎప్పటికప్పుడు తగు సూచనలు జారీ చేశారు. అనంతరం సిరిమాను ఏర్పాట్లను ఎస్.పి దీపిక తో కలసి కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షించారు. తొలుత జిల్లా కలెక్టర్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం డిప్యూటీ స్పీకర్ కోలగట్ల మీడియా తో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ  జరగనంత ఘనంగా ఈ ఏడాది ఉత్సవాలు, పండగ జరిగిందని అన్నారు. గతం కంటే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని, ఏ ఒక్కరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు గావించడం జరిగిందన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల కోసం ఎంతో కష్టపడుతున్నారని, అమ్మవారి కృప ఆయన పై ఉండాలని  వేసుకోవడం జరిగిందని అన్నారు.

Related posts

హన్మకొండలో లయన్స్ క్లబ్ గురుపూజోత్సవం

Satyam NEWS

చైత్ర హత్యలో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

గందరగోళంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్

Bhavani

Leave a Comment