31.2 C
Hyderabad
May 3, 2024 01: 44 AM
Slider ముఖ్యంశాలు

అధికారిక పర్యటన నుంచి వచ్చీరాగానే…

#rkroja

ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వారం రోజులు దుబాయ్ లో జరిగిన పరిశ్రమలకు సంబంధించి ఎక్సపో  పర్యటన ముగించుకుని నిన్ననే హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు పలు పరిశ్రమలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని నిన్న హైదరాబాద్ కు రావడం ఈరోజు మరణించడంతో ఈ విషయాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. 49 సంవత్సరాల చిన్నవయసులోనే ఎంతో భవిష్యత్తు ఉన్న గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మరణించడం తో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, వైకాపా పార్టీ శ్రేణులు తీవ్ర షాక్ కి గురయ్యారు.

పలువురు రాజకీయ నాయకులు,ప్రముఖులు  సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించారు. తండ్రి రాజమోహన్ రెడ్డి  సుదీర్ఘ కాలం పలు దఫాలు MLA గా ఎంపీ గా అనేక పదవుల్లో  రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగారు. గౌతమ్ రెడ్డి తల్లిదండ్రులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, మణి మంజరి. సొంత గ్రామం నెల్లూరు జిల్లా ఉదయగిరి దగ్గరలోని బ్రాహ్మణ పల్లి. 2-11-1971 న జన్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి విద్యాభ్యాసం గ్రాడ్యుయేషన్  హైదరాబాద్ లో, UK లో MSC టెక్స్ టైల్స్ లో మాస్టర్స్ పూర్తి చేశారు.

తర్వాత వ్యాపార రంగంపై మక్కువతో 1997 లో KMC  కన్స ట్రక్షన్స్ తో వ్యాపారం మొదలుపెట్టారు. 2014 లో వైకాపా తరపున రాజకీయ రంగ ప్రవేశం చేసి సీనియర్ లీడర్ ఆనం రామనారాయణ  రెడ్డి పై జిల్లా లొనే అత్యధిక మెజార్టీ తో  గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019లో మళ్ళీ  రెండో దఫా ఎమ్మెల్యే గా  గెలవడం తోపాటు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో కీలక  శాఖలు దక్కించుకున్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి కి భార్య శ్రీ కీర్తి, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.

99TV సాగర్ రెడ్డి

Related posts

కోర్టు ఆదేశాలను మళ్లీ తప్పు పట్టిన సిఎం జగన్

Satyam NEWS

కోడికత్తి కేసులో అన్నీ అసత్యాలే చెప్పారు: ఎన్ఐఏ

Bhavani

వాక్ ఫర్ ఎథిక్స్: యాదాద్రిలో నైతిక విలువల నడక

Satyam NEWS

Leave a Comment