సమాజంలో తగ్గిపోయిన నైతిక విలువలను పెంచేందుకు తమ వంతు సాయంగా మిషన్ ఎథికల్ ఇండియా నేడు యాదగిరి గుట్టలో వాక్ ఫర్ ఎథిక్స్ నిర్వహించింది. రాయగిరి నుంచి యాదగిరి గుట్ట వరకూ పాదయాత్ర చేసి తమ ప్రయత్నాన్ని రాష్ట్రానికి తెలియ చెప్పేందుకు నిర్వాహకులు ప్రయత్నించారు.
వాక్ ఫర్ ఎథిక్స్ ను ధర్మ యాత్రగా నిర్వహించిన వీరు యాదగిరి గుట్టకు చేరుకుని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకున్నారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ప్రతాప్ మల్లాది తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ అధికారులకు, పోలీసు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.