38.2 C
Hyderabad
April 29, 2024 12: 42 PM
Slider క్రీడలు

ఆగష్టు 30 నుంచి ఆసియా కప్

#asia cup

ఆసియా కప్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఆగస్ట్‌ 30 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఆసియా కప్‌ 2023 జరగనుంది. ఆరు దేశాలు పాల్గొనే మినీ టోర్నీ కోసం పాకిస్థాన్‌, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

పాక్‌లో నాలుగు మ్యాచ్‌లు, శ్రీలంకలో తొమ్మిది మ్యాచ్‌లు లెక్కన హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించేందుకు ఏషియన్‌ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌ ఏలో భారత్‌, పాకిస్థాన్‌, నేపాల్‌ ఆడుతుండగా… గ్రూప్‌ బిలో బంగ్లాదేశ్‌, ఆఫ్గానిస్థాన్‌, శ్రీలంక ఆడనున్నాయి. గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లు ఆగస్టు 30 నుంచి మొదలవుతాయి.

సూపర్‌ 4 మ్యాచ్‌లు సెప్టెంబరు 6 నుంచి ఉంటాయి. సెప్టెంబరు 17న ఫైనల్‌ మ్యాచ్‌ ఉంటుంది. పాకిస్థాన్‌తో సెప్టెంబరు 2న, నేపాల్‌తో సెప్టెంబరు 4న భారత్‌ మ్యాచ్‌లు ఆడుతుంది.

Related posts

సైబర్ ప్రపంచంలో మావన బలహీనతలపై ఫేస్ బుక్ లైవ్

Satyam NEWS

సామాన్య ప్రజల పైనే మావోయిస్టుల దాడులు

Satyam NEWS

గంజాయి విక్రయించినా, సేవించినా, కలిగివున్నా కఠిన చర్యలు

Bhavani

Leave a Comment