38.2 C
Hyderabad
April 27, 2024 17: 55 PM
Slider విజయనగరం

గంజాయి విక్రయించినా, సేవించినా, కలిగివున్నా కఠిన చర్యలు

#SP M. Deepika

గడచిన పక్షం రోజుల నుంచీ విజయనగరం జిల్లాలో గంజాయి యథేచ్ఛగా విక్రయాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసు బాస్ దీపికా తన ఆధ్వర్యంలోనే దాన్ని సమూలనంగా అరికట్టేందుకు ప్రత్యేక బృందం ఒకటి ఏర్పరచి…నిఘా ముమ్మరం చేసారు. ఈ క్రమంలో గంజాయి విక్రయం, రవాణ, సేవించిన వారిపై కఠిన చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు. గంజాయి సేవించే వారిపైన, వారికి గంజాయి విక్రయించే వారిపై కఠిన చర్యలు చేపట్టేందుకు జిల్లా పోలీసుశాఖ ఇప్పటికే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిందన్నారు.

ఈ బృందం గంజాయి సేవించేందుకు అనుకూలం ఉన్న నిర్మానుష్య ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నదన్నారు. గంజాయి చిన్న మొత్తాల్లో విక్రయించే వారిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టి, ముందస్తు సమాచారాన్ని సేకరించి, వారిపై రైడ్స్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ రైడ్స్లో భాగంగా గత 10రోజుల్లో గంజాయి సేవించిన వారిపైన 15కేసులు, వాటిని విక్రయిస్తున్న వారిపై మూడు కేసులు నమోదు చేసి, నిందితులను రిమాండు కు తరలించామన్నారు.

స్పెషల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈ బృందం ఇకపై దాడులు కొనసాగిస్తుందన్నారు. ఈ బృందాన్ని ప్రోత్సహించుటలో భాగంగా బృందంలో 5గురు కానిస్టేబుళ్ళును జిల్లా ఎస్పీ తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలను, ప్రోత్సాహక బహుమతులను అందజేసారు. గంజాయి సేవించే వారికి గంజాయిని చిన్న మొత్తంలో విక్రయిస్తున్న వ్యాపారులు, గంజాయి సేవిస్తున్న వారిపై ప్రత్యేకంగా నిఘా

ఏర్పాటు చేసి, వారిని అదుపులోకి తీసుకొని, సంబంధిత పోలీసు స్టేషనులకు అప్పగించాల్సిందిగా బృందసభ్యులకు జిల్లా ఎస్పీ ఎం.దీపిక దిశా నిర్దేశం చేసారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సిఐ జి. రాంబాబు, ఎస్ఐ సత్యన్నారాయణ పాల్గొన్నారు.

Related posts

మేఘన బేకరీని ప్రారంభించిన ములుగు ఎమ్మెల్యే

Satyam NEWS

శాంతి భద్రతలు చక్కగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి

Satyam NEWS

షార్ప్ ఎడ్జి: బిజెపిలో చేరబోతున్న కత్తి మహేష్

Satyam NEWS

Leave a Comment