37.2 C
Hyderabad
May 2, 2024 12: 20 PM
Slider హైదరాబాద్

సైబర్ ప్రపంచంలో మావన బలహీనతలపై ఫేస్ బుక్ లైవ్

#CyberSeafty

మానవ బలహీనతలపై మనతో ఎలా ఆడుకోవాలో సైబర్ నేరగాళ్లకు తెలిసినంతగా మరెవరికి తెలియదు. మానవ బలహీనతలను అడ్డంపెట్టుకుని మనలో సెంటిమెంట్లను రెచ్చగొడుతూ జీవితాలను దుర్భరం చేయడం సైబర్ నేరగాళ్లకు వెన్నతో పెట్టిన విద్య.

ఈ ప్రమాదం నుంచి మనల్ని మనం బయట పడేసుకోవడానికి, మన సాటి వారు ఈ విధమైన సైబర్ నేరాలకు గురి కాకుండా ఉండటానికి తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం వారు సింబయాసిస్ లా స్కూల్ లీగల్ ఎయిడ్ సెంటర్ తో కలిసి నేటి సాయంత్రం 4 గంటలకు ఫేస్ బుక్ లైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Social Engineering – The Human Weakness అనే అంశంపై CybHER క్యాంపెయిన్ లో భాగంగా నేడు ఈ ఫేస్ బుక్ లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సైబర్ జాగృతి వ్యవస్థాపకుడు రూపేష్ మిట్టల్ ఈ లైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆయన పలు అంశాలను వివరిస్తారు.

సమాచార సేకరణలో మైండ్ ట్రిక్స్, మనపై చూపే ప్రభావం దానికి సంబంధించిన ఐదు ముఖ్యమైన అంశాలను రూపేష్ మిట్టల్ వివరిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని సైబర్ ప్రపంచంలో ఉంటూనే పూర్తి రక్షణ పొందవచ్చు.

(తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం నుంచి సత్యం న్యూస్ కు ప్రత్యేకం)

Related posts

ట్రూ అప్ చార్జీలు రద్దు చేయకపోతే పోరాటం తీవ్రం చేస్తాం

Satyam NEWS

ప్రముఖ నటుడు కృష్ణంరాజు ఇకలేరు

Satyam NEWS

బాలల భవిష్యత్తే దేశ భవిష్యత్తు ఏఎస్‌పీ

Sub Editor

Leave a Comment