26.7 C
Hyderabad
May 3, 2024 08: 19 AM
Slider నల్గొండ

అస్సాం ముఖ్యమంత్రి పై తక్షణమే కేసు నమోదు చేయాలి

#congressparty

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో సోమవారం హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు,మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ మీద అస్సాం సిఎం హేమంత్ బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని,ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదని హితవు పలికారు.

సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు తరలి వెళ్ళి స్థానిక పోలీస్ స్టేషన్లో అస్సాం సిఎం మీద ఫిర్యాదు చేశారు.అస్సాం సిఎం మీద వెంటనే కేసు నమోదు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే సభ్యుడు ఎరగని నాగన్న గౌడ్,పార్టీ సీనియర్ నాయకుడు సాముల శివారెడ్డి,జిల్లా మైనారిటీ అధ్యక్షుడు ఎండి.నిజాముద్దీన్,రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఎండి.అజీజ్ పాషా,బాచిమంచి గిరిబాబు,కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్,మాజీ జడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు,మండల పార్టీ అధ్యక్షుడు చక్ర వీరారెడ్డి,పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు జక్కుల మల్లయ్య, గొట్టిముక్కుల రాములు,కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి,వక్ఫ్ బోర్డ్ మాజీ డైరెక్టర్ షేక్.సైదా మేస్త్రి,కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులు,వార్డు కమిటీ అధ్యక్షులు,అనుబంధ సంఘాల నాయకులు వల్లపు దాసు కృష్ణ, కంకణాల పుల్లయ్య,వెలిదండ  వీరారెడ్డి,కారింగుల వెంకటేశ్వర్లు,కోడి ఉపేందర్,మేళ్ళచెరువు ముక్కంటి, పోతన బోయిన రామ్మూర్తి,రెడపంగు రాము,మామిడి కాశయ్య,దొంతగాని జగన్,కస్తాల ముత్తయ్య,కస్తాలు సైదులు,కోల మట్టయ్య,సులువా చంద్రశేఖర్,వేముల నాగరాజు, సంక్రాంతి కోటేశ్వరరావు,కందుకూరి రాము,మేళ్లచెరువు సురేష్,ఆకుల రాము,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

జూలూరుపాడు తహసీల్దార్ గా శారద

Murali Krishna

నల్లపోచమ్మ ఆలయంలో ఘనంగా బోనాలు

Satyam NEWS

తెలంగాణలో మత కార్డు వాడితే పని చేయదు

Satyam NEWS

Leave a Comment