40.2 C
Hyderabad
May 1, 2024 17: 20 PM
Slider ముఖ్యంశాలు

ఒక్క డీజీపీ త‌ప్ప మిగిలిన వారెవ్వ‌రూ మాస్క్ ధ‌రింలేదు..!

#dgp

టూటౌన్ పోలీస్ స్టేష‌న్ భ‌వ‌న ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో విశేషం….!

రాష్ట్ర  డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీస్….అంటే డీజీపీ..పోలీస్ శాఖ‌కే  పెద్దాయ‌న. డీజీపీ  ఏం చెతితే అది యావ‌త్ శాఖ‌లో శిలాశాస‌నం లాంటి మాటే. అలాంటి డీజీపీ ఒక్క‌రే….క‌రోనా స‌మ‌యంలో పోలీస్ శాఖ స్వ‌యంగా జారీ చేసిన నిబంద‌న‌ల‌ను పాటించి…టూటౌన్ పోలీస్ స్టేష‌న్ ప్రారంభోత్స‌వంలో…మాస్క్ పెట్టుకుని స్ప‌ష్టంగా క‌నిపించారు.

విజ‌య‌న‌గ‌రానికి  మూడో పోలీస్ స్టేష‌న్ కావాలి,రావాలి అన్న ప్ర‌తిపాద‌న వ‌చ్చిన  సంద‌ర్బంలోనే  యావ‌త్ పోలీస్ శాఖ‌కే ఆద‌ర్శంగా నిలిచారు…పోలీస్ బాస్…రాష్ట్ర డీజీపీ  గౌతంస‌వాంగ్. రెండు రోజుల క్రిత‌మే విశాఖ‌కు భార్యతో స‌హా విచ్చేసిన  డీజీపీ గౌతం స‌వాంగ్…అన‌కాప‌ల్లిలో ఆప‌రేష‌న్ ప‌రివ‌ర్త‌న్  కార్య‌క్ర‌మంలో పాల్గొని గంజాయి సాగు..గిరిపుత్రుల‌తో మ‌మేకం అన్న కార్య‌క్ర‌మంలో మాట్లాడారు కూడ.

త‌న ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న‌లో కాస్త  ఖాళీ ఉండ‌టంతో ఎప్ప‌టి నుంచీ వాయిదా ప‌డుతూ వ‌స్తున్న విజ‌య‌న‌గ‌రం టూటౌన్ పీఎస్  కొత్త భ‌వ‌నాన్ని ప్రారంభించాల‌ని ఓ  నిర్ణ‌యానికి వ‌చ్చారు.ముందు రోజు రాత్రే…విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీతోనూ ఏఎస్పీ అనిల్  తో డీజీపీ మాట్లాడంతో హుటాహుటిన ప్రారంభోత్స‌వానికి ఏర్పాట్లను షురూ చేసింది..జిల్లా పోలీస్ శాఖ‌.

ఈ క్ర‌మంలోనే న‌గ‌రంలో ఉంటున్న ఎస్ఐ నుంచీ సీఐ ఏఎస్పీస్థాయి  వ‌ర‌కు  పోలీస్ సిబ్బంది అంతా యూనీఫాంతో హాజ‌ర‌వ్వాల‌ని మాన్యువ‌ల్ కు త‌గిన‌ట్టు గా అటు లా అండ్ ఆర్డ‌ర్,ఇటు స్పెష‌ల్ బ్రాంచ్,మ‌రోవైపు ఇంట‌లిజెన్స్, అలాగే ట్రాఫిక్  ఇలా అన్ని విభాగాల సిబ్బంది  పోలీస్ బాస్ కు ప్రోటోకాల్ ప్ర‌కారం…త‌మ‌,త‌మ‌విధుల‌లో పాల్గొన్నారు.

ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌జాప్ర‌తినిధులు డిప్యూటీ సీఎం, జేడ్పీ చైర్మ‌న్, ఎమ్మెల్యే ,ఎమ్మెల్సీ…ఇలా అంద‌రూ హాజ‌రైన  సంద‌ర్బంగా ఒక్క పోలీస్ బాస్  డీజీపీ మాత్ర‌మే మాస్క్ పెట్టుకుని కనిపించ‌డం విశేషం.కార్య‌క్ర‌మంలో స్టేజ్ పైకి వెళ్ల క ముందు…సోఫాలో అటు జేడ్పీ చైర్మ‌న్,ఇటు  స్థానిక ఎమ్మెల్యే ల మ‌ధ్య డీజీపీ మాస్క్ పెట్టుకుని కూర్చున్న‌….ఇద్ద‌రు ప్ర‌జాప్ర‌తినిదులు…క‌నీసం డీజీపీని చూసైనా స‌రే మాస్క్ పెట్టుకోక‌పోవ‌డం విశేషం.

Related posts

మంత్రి రోజాకు మరో పదవి

Satyam NEWS

డీఎస్పీ పాపారావు అకాల మరణం తీరని లోటు

Satyam NEWS

ఒక్క రాజదానికే దిక్కు లేదు..మూడు రాజధానులా…

Satyam NEWS

Leave a Comment