33.7 C
Hyderabad
April 30, 2024 00: 51 AM
Slider ముఖ్యంశాలు

విమర్శిస్తే బదులివ్వాలి కాని దాడులు చేస్తారా?

#vijayamma

 వైఎస్సార్ తెలంగాణ  అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అరెస్టు చేయడంపై ఆమె తల్లి వైఎస్‌ విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమార్తెకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. తన  కుమార్తెను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. చూసేందుకు వెళ్తుంటే  అడ్డుకున్నారు. ఇంటికే తీసుకొస్తామని పోలీసులు చెబుతున్నారు. తీసుకొచ్చే వరకు ఇంటి గేటు వద్దే కూర్చుంటా. తన  కుమార్తె ఎక్కడా పరుష పదజాలం వాడలేదు. విమర్శిస్తే బదులివ్వాలి కానీ.. దాడులు చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం మూల్యం చెల్లంచుకోక తప్పదు. ప్రజల నుంచి షర్మిలను ఎవ్వరూ వేరు చేయలేరు. మహిళపై దాడి జరిగినప్పుడు ప్రతి నాయకుడు స్పందిస్తారు.. అందులో భాగంగానే బండి సంజయ్‌ స్పందించారు. తన  కుమార్తెకు ఎప్పుడూ అండగా ఉంటా’’ అని విజయమ్మ స్పష్టం చేశారు. ప్రగతిభవన్‌ ముట్టడికి  కారులో బయల్దేరిన వైఎస్‌ షర్మిలను పంజాగుట్ట చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. షర్మిల డ్రైవింగ్‌ సీట్లో ఉండగానే కారును పోలీసు క్రేన్‌ వాహనంతో లిఫ్ట్‌ చేసి తరలించారు. పోలీసుల వైఖరిపై వైతెపా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Related posts

జులై 9 నుంచి ఆషాఢ బోనాలు

Bhavani

వనపర్తి పోలీస్ ప్రజావాణిలో 10 ఫిర్యాదులు

Satyam NEWS

రిమ్స్‌లో కరోనా రోగులకు మెరుగైన వసతులు కల్పించాలి

Satyam NEWS

Leave a Comment