26.2 C
Hyderabad
February 13, 2025 22: 12 PM
Slider కర్నూలు

రాయలసీమలో మళ్లీ పడగ విప్పిన ఫ్యాక్షన్ భూతం

factions in rayalaseema

గత కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న రాయలసీమలోని కర్నూలు జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ భూతం పడగ విప్పింది. ఏడుగురిపై ప్రత్యర్థులు వేట కొడవళ్లతో ఈ ఉదయం దాడికి దిగడం తీవ్ర కలకలాన్ని రేపింది. దాడికి గురైన బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లా పరిధిలోని కోసిగిలో ఈ ఘటన చోటు చేసుకోగా, నిమ్మయ్య అనే వ్యక్తి కుటుంబానికి చెందిన వారిపై అనుమేశ్ అనే వ్యక్తి కుటుంబీకులు దాడి చేసినట్టు తెలుస్తోంది.

విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు భారీ ఎత్తున బలగాలను ఆ ప్రాంతానికి తరలించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ రెండు కుటుంబాల మధ్య గొర్రెల విషయంలో వివాదాలు ఉన్నాయని తెలుస్తోంది. ఘటనపై కేసును నమోదు చేశామని, విచారిస్తున్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

Related posts

ఇంటర్ విద్యార్ధిని దుర్గ మరణానికి బాధ్యుడు ప్రిన్సిపాలే

Satyam NEWS

సిఎం కేసీఆర్ మనుమడా మజాకానా?

Satyam NEWS

బిజెపి నాయకుడు ఎల్లేని ప్రకటనతో సంతోషంలో కొల్లాపూర్ ముస్లింలు

Satyam NEWS

Leave a Comment