29.7 C
Hyderabad
May 2, 2024 05: 02 AM
Slider మహబూబ్ నగర్

భూముల వేలాన్ని తెలంగాణ ప్రభుత్వం తక్షణమే ఆపాలి

#narayanpet

రాష్ట్రంలో ప్రభుత్వ భూముల వేలం ఆపాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నారాయణపేట జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. జీవో నెంబర్ 13 ఉపసంహరించుకోవాలని, పేదలకు ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్స్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను పరిశ్రమల స్థాపనకు వినియోగించాలని వారు కోరారు. విద్య, వైద్యం లాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి తప్ప వేలం వేయడమేమిటని వారు ప్రశ్నించారు.

ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న CPI నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కొండన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ చట్టం చేసి పది మాసాలు గడుస్తున్నా పూర్తి స్థాయిలో అమలు జరగడం లేదని అన్నారు. ఆర్థిక అవసరాలకు ప్రభుత్వ భూములను అమ్మకాన్ని ఉపసంహరించుకోవాలని, మరోవైపు ప్రజా ప్రతినిధులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ భూములను ఆక్రమిస్తూన్నా పట్టించుకోవట్లేదని ఆయన అన్నారు.

అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆస్తుల విక్రయం ద్వారా 20 వేల కోట్లు రూపాయలు సమకూర్చుకోవాలని బడ్జెట్లో చేసిన ప్రతిపాదనను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నామని ప్రభుత్వం ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం సుపరిపాలన కాదని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ఉన్న భూములు, దేవాదాయ, దళితుల, వెనుకబడిన వర్గాలకు కేటాయించిన భూములను అభివృద్ధి పేరిట పోడు భూములను వేలం వేసి ఆదాయాన్ని సమకూర్చుకోవడాన్ని CPI వ్యతిరేకిస్తుందని తెలియజేశారు.

తెలంగాణ రాష్ట్రం మిగులు రాష్ట్రం అని గొప్పలు చెప్పుతు ముఖ్యమంత్రి ప్రభుత్వ భూములను ఎందుకు వేలం వేస్తున్నారని CPI ప్రశ్నిస్తోంది. అదేవిధంగా అనేక మంది మంత్రులు శాసనసభ్యులు అధికార పెద్దలపై భూముల ఆక్రమణ ఆరోపణలు వచ్చినప్పటికీ ప్రభుత్వం ఏం చేస్తుందని తక్షణమే అట్టి భూముల పై విచారణ కమిషన్ నియమించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న పేదలకు జీవో నెంబర్ 58 ప్రకారం పట్టాలు ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించాలని అని తదితర డిమాండ్లతో కలెక్టర్ కార్యాలయంలో బీటీ రవికుమార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నారాయణపేట జిల్లా అధ్యక్షులు చౌడపూర్ శ్రీనివాసులు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటేష్ , ఏఐటీయూసీ జిల్లా నాయకులు నర్సిములు తదితరులు పాల్గొన్నారు.

గద్దెగూడెం యాదన్న, సత్యం న్యూస్, నారాయణపేట

Related posts

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కర్ఫ్యూ వేళల్లో సడలింపులు

Satyam NEWS

అదుపుతప్పి పొలాల్లోకి తీసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

Satyam NEWS

“Master” Problem: రేవంత్ రెడ్డి పర్యటనపై ఉత్కంఠ

Satyam NEWS

Leave a Comment