33.7 C
Hyderabad
April 29, 2024 23: 43 PM
Slider క్రీడలు

చావుతప్పి కన్నలొట్టపోయిన చందంగా ఆస్ట్రేలియా విజయం

#t20

టీ20 ప్రపంచకప్‌లో 38వ మ్యాచ్ అడిలైడ్‌లో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అనంతరం అఫ్గానిస్థాన్‌ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. నాలుగు తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నాలుగు పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించడంతో పాటు శ్రీలంకను సెమీ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించేలా చేసింది. ఐదు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాకు ఏడు పాయింట్లు ఉన్నాయి. న్యూజిలాండ్ కూడా ఐదు మ్యాచ్‌ల్లో ఏడు పాయింట్లను కలిగి ఉంది. మెరుగైన నెట్ రన్ రేట్ ఆధారంగా ఆస్ట్రేలియా కంటే న్యూజిలాండ్ ముందున్నాది.

ఆస్ట్రేలియా ఇప్పుడు సెమీఫైనల్‌కు చేరుకోవడానికి శనివారం ఇంగ్లాండ్‌పై శ్రీలంక విజయం కోసం ప్రార్థన చేయాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో లంక జట్టు గెలిస్తే ఇంగ్లండ్‌ కు కష్టాలు తప్పవు. శ్రీలంక నాలుగు మ్యాచ్‌ల్లో ఆడి నాలుగు పాయింట్లు సాధించింది. నాలుగు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌కు ఐదు పాయింట్లు ఉన్నాయి. ఒకవేళ శ్రీలంక గెలిచినా ఆరు పాయింట్లు ఉంటాయి. అందువల్ల ఏడు పాయింట్లలో ఉన్న ఆస్ట్రేలియాను దాటి ముందుకు వెళ్లలేదు. అదే సమయంలో ఇంగ్లండ్ గెలిస్తే ఏడు పాయింట్లు లభించడంతో పాటు మెరుగైన నెట్ రన్ రేట్ ఆధారంగా సెమీఫైనల్‌కు చేరుకుంటుంది.

Related posts

R V టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ప్రత్యేక ప్యాకేజీలు

Satyam NEWS

హ్యాక్ అయిన కొల్లాపూర్ ఎమ్మెల్యే ట్విట్టర్ ఖాతా

Satyam NEWS

కేంద్ర పీఏసీ సభ్యుడిగా విజయసాయి రెడ్డి ఎంపిక

Satyam NEWS

Leave a Comment