33.7 C
Hyderabad
April 29, 2024 23: 39 PM
Slider మహబూబ్ నగర్

హ్యాక్ అయిన కొల్లాపూర్ ఎమ్మెల్యే ట్విట్టర్ ఖాతా

#kollapurmla

అసలే రాజకీయ వేడితో సతమతం అవుతున్న నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే భీరం హర్ష వర్ధన్ రెడ్డి ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారు. ఆయన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేయడమే కాకుండా భీరం అనే ఇంటిపేరును ‘బీరు’ హర్షవర్ధన్ రెడ్డి గా మార్చి అందరికి అసభ్యకరమైన సందేశాలను పంపుతున్నారు. బీర్ హర్ష వర్థన్ రెడ్డి పేరుతో వస్తున్న మెసేజీలు చూసి ఆయన అభిమానులు తల్లడిల్లుతున్నారు. ఈ విషయం ఆయనకు తెలియడంతో శనివారం హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఆయన ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ట్విటర్‌ హెల్ప్‌ డెస్క్‌ సెంటర్‌ పేరిట ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డికి ఓ లింక్‌ వచ్చింది. దానిపై క్లిక్‌ చేయడంతోనే అవతలి వ్యక్తులు కొన్ని ప్రశ్నలు అడిగారు. సమాధానాలు చెప్పడం ముగిసిన కొద్దిక్షణాల్లోనే ‘మీ ట్విటర్‌ ఖాతా బ్లాక్‌ అయింది’ అనే సంక్షిప్త సందేశం వచ్చింది. ఆ తర్వాత ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పేరులోని ‘బీరం’ను ‘బీర్‌’గా మార్చి.. ఆ ఖాతాలో స్నేహితులుగా ఉన్నవారందరికీ అసభ్య సందేశాలు పంపిస్తున్నారు. దీనిపై ఎమ్మెల్యే హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు.

Related posts

బదిలీ అయిన ట్రాఫిక్ ఎస్ఐలకు ఆత్మీయ వీడ్కోలు

Satyam NEWS

లాక్ డౌన్ పటిష్ట అమలుకు డ్రోన్ కెమెరాల వినియోగం

Satyam NEWS

ఉద్యమ కారుల త్యాగాలు మరిచిన కల్వకుర్తి

Satyam NEWS

Leave a Comment