38.2 C
Hyderabad
May 2, 2024 20: 04 PM
Slider రంగారెడ్డి

సీబీఐటీ విద్యార్థి ప్రతిభ

#cbit

ఈ నెల జూలై 1న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన ఐడియా పోటీలో సీబీఐటీకి విద్యార్థిని కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో రెండవ సంవత్సరం చదువుతున్న స్వరాలి శర్మ కి  ద్వితీయ బహుమతి లభించింది. ఈ సందర్భంగా సిబిఐటి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి వెంకట నర్సింహులు, కుమారి  స్వరాలి ని అభినందిచారు.  ప్రిన్సిపాల్ మాట్లాడుతూ  స్వరాలికి 10,000 రూపాయల  నగదు బహుమతి మరియు  ఇంక్యుబేషన్ స్థాపించుటకు 1  లక్ష రూపాయల సపోర్ట్ లభించింది అని తెలిపారు. ఈ పోటీలను ఉస్మానియా యూనివర్సిటీ బిజినెస్ ఇంక్యుబేటర్ మరియు ఫైండ్‌హోప్  సంయుక్తంగా నిర్వహించారు. ఇతర కళాశాల విద్యార్థులు శ్రీ సాయి మహిత్ వాసంశెట్టి, మణిచేగు, జువేరియా అబ్దుల్ రహీం మహమ్మద్ విద్యార్థులు టాప్  10 విజేతలలో జాబితాలో వున్నారు అని ప్రిన్సిపాల్ తెలిపారు.  ఈ సందర్భంగా సిబిఐట్ ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్ అడ్వైజర్ ప్రొఫెసర్ ఉమాకాంత్ చౌదరి, సిఎస్‌ఇ హెడ్ ప్రొఫెసర్ ఎం స్వామి దాస్ మరియు ఇతర సిబ్బంది విద్యార్థిని అభినందించారు.

Related posts

దళితుల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్న కొల్లాపూర్ ఎస్సై

Satyam NEWS

కష్టపడి పని చేసేవారికి గతంలో కొన్ని జబ్బులు వచ్చేవి కావు

Satyam NEWS

ఒకేసారి 77 మంది డీఎస్పీ లకు స్థానచలనం…!

Satyam NEWS

Leave a Comment