29.7 C
Hyderabad
May 1, 2024 10: 37 AM
Slider మహబూబ్ నగర్

విద్యార్థులకు షీ టీం పై భరోసా కల్పించిన ఏఎస్పి సిహెచ్ రామేశ్వర్

#sheeteams

ఇంటర్మీడియట్ దశలో ఉన్న విద్యార్థులు చెడు మార్గంలో పడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ ఎస్పీ సిహెచ్ రామేశ్వర్ పలు సూచనలు చేశారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా, పాలెం గ్రామ వెంకటేశ్వర ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ విద్యార్థులకు (ఫ్రెషర్స్)  కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా అడిషనల్ ఎస్పీ సిహెచ్ రామేశ్వర్ పాల్గొని విద్యార్థులకు  అవగాహన కల్పించారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకోవలన్నారు.

తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ప్రతి విద్యార్థికి జీవిత లక్ష్యం అనేది  ఉండాలన్నారు. చదువులపై విద్యార్థులు శ్రద్ధ  వహించాలన్నారు. బాల్య వివాహల పై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. కళాశాలకు వెళ్లే సమయంలో లేదా మరి ఎక్కడైనా వేధింపులకు గురవుతే వెంటనే సి టీం ను సంప్రదించాలని సూచించారు.

ఆపదలో డయల్ 100 కు సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచబడతాయని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా సి టీం డిస్ట్రిక్ట్ వాట్సాప్ నెంబర్ 7901099455 ఇచ్చారు. వివరాలు  పంపిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. సమాచారం అందిన వెంటనే సమస్య పరిష్కరించడం జరుగుతుందని భరోసానిచ్చారు. అదేవిధంగా పొక్సో చట్టంపై, సెల్ ఫోన్, సోషల్ మీడియా, ఇంటర్నెట్ పై దుర్వినియోగంపై అవగాహన కల్పించారు.

Related posts

స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘మసూద’ నవంబర్ 11న విడుదల

Satyam NEWS

సెప్టెంబర్ మొదటి వారంలో ‘ఇక్షు’ మూవీ రిలీజ్

Satyam NEWS

అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్న అక్రమ షెడ్లు

Satyam NEWS

Leave a Comment