33.7 C
Hyderabad
April 28, 2024 23: 41 PM
Slider సినిమా

స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘మసూద’ నవంబర్ 11న విడుదల

#masuda

‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్‌బస్టర్‌ల తర్వాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇప్పటికే తన మూడో సినిమా ‘మసూద’ను ప్రకటించింది. మళ్ళీ రావా ఒక లవ్-స్టోరీ మరియు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఒక డిటెక్టివ్-థ్రిల్లర్,  ఇప్పుడు మేకర్స్ మసూదతో మరో కొత్త జానర్ హారర్-డ్రామాతో వస్తున్నారు, ఇది నవంబర్ 11న విడుదల కానుంది.

ఈ సందర్భగా చిత్ర నిర్మాత రాహూల్ యాదవ్ నక్క మాట్లాడుతూ “మనం ఒక మంచి హారర్ డ్రామాను చూసి చాలా కాలం అయ్యింది.   మంచి హార్రర్ చిత్రాలలో  మసూద ఒకటిగా నిలుస్తుందని నా గట్టి నమ్మకం. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన టీజ‌ర్‌కి, పోస్ట‌ర్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, త‌మిళంలో కూడా ఒకేసారి విడుద‌ల చేయ‌డానికి  ప్లాన్ చేస్తున్నాం.  అతి త్వరలో ఇతర  వివరాలను తెలియజేస్తాం.  అన్నారు. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాష్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణతేజ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

బ్యానర్: స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్, కళ: క్రాంతి ప్రియం, కెమెరా: నగేష్ బానెల్, స్టంట్స్: రామ్ కిషన్ మరియు స్టంట్ జాషువా, సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి, ఎడిటింగ్: జెస్విన్ ప్రభు, పిఆర్‌ఓ: బి.వీరబాబు, నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా, రచన, దర్శకత్వం: సాయికిరణ్

Related posts

ఘోరం: మూడోతరగతి బాలికపై అత్యాచార యత్నం

Satyam NEWS

లిబియా అధ్యక్ష బరిలో గడాఫీ కుమారుడు

Sub Editor

సినీ దర్శకుడు మదన్ హఠాన్మరణం!!

Satyam NEWS

Leave a Comment