38.7 C
Hyderabad
May 7, 2024 17: 35 PM
Slider మహబూబ్ నగర్

ప్రభుత్వ అధికారులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు

#nagarkurnoolcollecorate

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్లో సమాచార హక్కు చట్టం 2005 పై ప్రభుత్వ అధికారులకు రెండు రోజులపాటు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా శిక్షణ కేంద్రం అధికారి డి. గోపాల్ తెలిపారు.

శుక్రవారం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రాంతీయ శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో  నిర్వహించిన కార్యక్రమంలో డి. గోపాల్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తూ సమాచార హక్కు చట్టం సెక్షన్లను చూస్తున్న అధికారులు సిబ్బందికి శుక్రవారం శనివారం రెండు రోజుల పాటు చట్టం పై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

కలెక్టరేట్ ప్రజావాణి సమావేశ మందిరంలో జిల్లా పరిపాలన అధికారి మొహమద్ అలీ డి టి సి మేనేజర్ గోపాల్ గౌడ్ కలిసి శిక్షణ తరగతులు ప్రారంభించారు.

శిక్షణా తరగతులకు శశిధర్ రెడ్డి సూపర్డెంట్ మెడికల్ డిపార్ట్ వనపర్తి జిల్లా ద్వారా తరగతులు నిర్వహించి ఆర్టిఐ యాక్ట్ పై అవగాహన కల్పించారు. ఈ శిక్షణా తరగతులకు జిల్లాలోని వివిధ శాఖల నుండి సిబ్బంది ప్రోగ్రామర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కర్నాటకలో ఒంటరిగానే పోటీ: అమిత్ షా

Satyam NEWS

పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించిన మంత్రి ఐకె రెడ్డి

Satyam NEWS

డోర్నకల్ మిర్యాలగూడ మధ్య రైల్వే ప్రాజెక్ట్

Murali Krishna

Leave a Comment