39.2 C
Hyderabad
April 28, 2024 13: 09 PM
Slider ఆదిలాబాద్

సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు

#Nirmal SP

నిర్మల్ జిల్లాలో కొంత మంది తెలిసి తెలియని జ్ఞానంతో, ఉద్రేక పూరిత మనస్తత్వంతో సోషల్ మీడియాను వేదికగా మార్చుకుని ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని, మరొక వర్గానికి చెందిన మత పరమైన ఒక వార్తను సృష్టించి ప్రచారం చేస్తున్నారు.

కల్పితమైన, అసంబద్ధమైన, జుగుప్సాకరమైన విషయాలను వాట్సాప్, ఫేస్ బుక్ లలో పెడుతూ, ప్రజలలో వైషమ్యాలను పెంచేలా, భావోద్వేగాలను రెచ్చగొట్టేలా చేస్తున్నారు. తద్వారా శాంతి భద్రతలకి భంగం కలిగేలా వాట్సాప్ లోని వివిధ గ్రూప్ లలో దుష్ప్రచారం ప్రారంభించారు.

ఇటీవల నిర్మల్ జిల్లాలో సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై 5 గురిపై కేసు నమోదు చేసి 20 మందిని బైoడోవర్ చేశారు. సోషల్ మీడియాను ఒక సుహృద్భావ వాతావరణంలో ప్రజా సంబంధాలను పెంపొందించుకోవడానికి, సమాచారాన్ని వేగంగా చేరవేసే ఒక వేదికగా వినియోగించాలి కానీ, సమాజంలో వైషమ్యాలు పెంచేలా, శాంతి భద్రతలకు భంగం కలిగించేలా, ఇతరుల వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బ తీసేలా దుర్వినియోగం చేయడం తీవ్రమైన నేరం.

కల్పితమైన విషయాలతో, ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా దుర్వినియగా పరిచే వ్యక్తులే కాకుండా వాట్సాఆప్ గ్రూపులలో ఇలాంటి విషయాలను షేర్ చేస్తే అట్టి గ్రూప్ అడ్మిన్ లపై కూడా సైబర్ చట్టాల కింద నాన్ బెయిలబుల్  కేసులు నమోదు చేస్తాము.

అంతే కాదు ఒక సారి మత పరమైన వైషమ్యాలు రెచ్చగొట్టే కేసులు నమోదు అయిన వ్యక్తులపై సంబంధిత పోలీస్ స్టేషన్లో 1.హిస్టరీ షీట్ ప్రారంభిస్తాం. అది జీవితాంతం వారికి మచ్చగా మిగిలిపోతుంది. 2.విద్యార్థులపై, యువకులపై ఒక సారి ఇలాంటి కేసులు నమోదు అయితే వారు భవిష్యత్తులో ఉద్యోగాలకు అనర్హులు అవుతారు.

3.ఉద్యోగ రీత్యా గాని, ఉన్నత చదువుల కోసం వెళ్లానుకుంటే వారికి పాస్ పోర్ట్, వీసా పొందడానికి అనర్హులు అవుతారు. 4.యువకులు అనాలోచితమైన, అవాస్థవమైన విషయాలను నమ్మి కేసులలో ఇరుక్కుని తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దు.

నిర్మల్ జిల్లా ఇంఛార్జి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్, ఐపిఎస్

Related posts

ప్రేమ పూజారినయ్యా..

Satyam NEWS

విజయనగరం శిల్పా రామంలో “రంగవల్లులు” పోటీలు…!

Satyam NEWS

14న ముగియనున్న షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష

Satyam NEWS

Leave a Comment