29.7 C
Hyderabad
May 1, 2024 09: 22 AM
Slider నిజామాబాద్

ఇంటితో బాటు పరిసరాలనూ పరిశుభ్రంగా ఉంచాలి

#PocharamSrinivasaReddy

మన ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మన పట్టణం కూడా స్వచ్ఛంగా ఉంటుందని రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు.

స్వచ్ఛ సర్వేక్షన్- స్వచ్ఛ బాన్సువాడ లో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ANR గార్డెన్ లో జరిగిన తడి చెత్త- పొడి చెత్త పై అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ పరిశుభ్రమైన పరిసరాలతో దోమలు వ్యాప్తి చెందవు,  రోగాలు వ్యాపించవు, పట్టణ ప్రజలు మున్సిపల్ కార్మికులకు సహకరించాలి.

ఇంట్లోని చెత్తను తడి పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ ట్రాక్టర్ వచ్చినప్పుడు కార్మికులకు అందించాలి. రోడ్లపై, డ్రైనేజీ కాలువలలో చెత్తను వేయరాదు అని చెప్పారు.

బాన్సువాడ పట్టణాన్ని మోడల్ టౌన్ గా తీర్చిదిద్దే బాధ్యత పట్టణ ప్రజలదే. ప్రజలు బాధ్యతాయుతంగా ఉండినప్పుడు ఇది సాద్యమవుతుంది. ప్రజల సౌకర్యం కోసం పట్టణంలో పెద్ద ఎత్తున మౌలిక సౌకర్యాలను కల్పిస్తున్నామని తెలిపారు.

Related posts

ఆస్పత్రిలో చేరిన సోనియాగాంధీ

Bhavani

ఈ వాన కాలం లోపే మన చెరువులు నింపుకుందాం

Satyam NEWS

మంగళగిరి NRI ఆస్పత్రి స్వాధీనానికి ‘‘అధికార’’ కుట్ర

Satyam NEWS

Leave a Comment