38.2 C
Hyderabad
May 3, 2024 19: 10 PM
Slider మహబూబ్ నగర్

అదృష్టాన్ని  పరీక్షించుకోవడానికి సమయం పొడిగింపు

#KollapurExise

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్  పట్టణంలో కొత్త బార్ అండ్ రెస్టారెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి  సమయం పొడిగించినట్లు కొల్లాపూర్  ఎక్సైజ్ సిఐ ఏడుకొండలు తెలిపారు. ఇది వరకు కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో  ఒక బార్ అండ్ రెస్టారెంట్  వున్న సంగతి తెలిసిందే.

కొన్ని రోజుల క్రిందట రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బార్ అండ్ రెస్టారెంట్ లకు  ప్రభుత్వం అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో కొల్లాపూర్ కూడా వుంది.

కొత్త బార్ అండ్ రెస్టారెంట్ లకు గత నెల 25నుండి దరఖాస్తు చేసుకోవడానికి  సమయం ఇచ్చింది. అవకాశం సోమవారంతో ముగిసింది. మంగళవారం  ఎక్సైజ్ శాఖ డైరెక్టర్  కొత్తగా  దరఖాస్తు చేసుకునేవారి కోసం ఈనెల 16వ తేదీ వరకు సమయం పొడిగించినట్లు సిఐ ఏడుకొండలు తెలిపారు.

18న జిల్లా కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా ఉంటుందన్నారు. ఇప్పటి వరకు మొత్తం 36 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు.అయితే మొత్తం మీద  16వరకు సమయం వుంది, దరఖాస్తుల సంఖ్య ఎంత వరకు పోతుందో చూడాలి.వారిలో  18న అదృష్టం ఎవరిని వరించబోతుందో  వేచి చూడాల్సిందే.

Related posts

బిజెపి పాలనతో దిగజారిన దేశ ప్రతిష్ట

Satyam NEWS

బీజేపీని తరిమికొట్టే పోరాటం తెలంగాణ నుంచే ప్రారంభం

Satyam NEWS

సీఎంఎస్-1 నింగిలోకి కౌంట్ డౌన్ ప్రారంభం

Sub Editor

Leave a Comment