31.7 C
Hyderabad
May 2, 2024 07: 42 AM
Slider నల్గొండ

బిజెపి పాలనతో దిగజారిన దేశ ప్రతిష్ట

#CITUSuryapet

పెద్ద నోట్ల రద్దు వల్ల దేశవ్యాప్తంగా పరిశ్రమలు మూతపడి, లక్షలాది మంది ఉద్యోగాలు పోయి, ఏర్పడిని సంక్షోభం నేటికీ కొనసాగుతున్నదని సూర్యాపేట జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షులు శీతల రోషపతి అన్నారు.

తాజాగా జి ఎస్ టి వల్ల దేశంలోని ఫెడరల్ వ్యవస్థకు ముప్పు ఏర్పడిందని, సిపిఎం పార్టీ నాడే చెప్పి విమర్శించిందని, అది నేడు నిజమైందని

 గుర్తు చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో విలేకరులతో రోషపతి మాట్లాడుతూ భారతదేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ పటంలో భారతదేశం ఆర్థికంగా మతతత్వంగా, కులాలుగా విభజించటం వల్ల పెద్ద నోట్ల రద్దు జి.ఎస్.టి వల్ల క్రింది స్థాయికి దిగజారిందని రోషపతి ఆరోపించారు.

ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కరోనా కాలంలో మొదట్లో భారత దేశం మంచిగా స్పందించి లాక్‌డౌన్‌ ప్రకటించడం, లైట్లు ఆపటం, చప్పట్లు కొట్టడం, పూలు చల్లడం చేసిందని అన్నారు.

ఈరోజు ప్రపంచంలో రెండో స్థాయికి ఎదిగి 40 లక్షల కరోనా కేసులు దాటితే ప్రభుత్వం చేతులు ఎత్తి ప్రజలను పట్టించుకోవడం లేదని, రామాలయం జపం చేస్తుందని ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు యలక సోమయ్య గౌడ్, దుర్గారావు, కోటమ్మ, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Related posts

జేసిబిని దొంగిలించిన వ్యక్తి అరెస్ట్

Satyam NEWS

పోలీసు నిబంధనలపై సోషల్ మీడియాలో అవాకులుచవాకులు

Satyam NEWS

సజెషన్: గెలిచిన వారు పదవులకు వన్నె తేవాలి

Satyam NEWS

Leave a Comment