37.2 C
Hyderabad
May 6, 2024 14: 31 PM
Slider రంగారెడ్డి

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న సైబరాబాద్ పోలీస్ కుటుంబాలు

#steefenravindra

సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ ఆవరణలో ఈరోజు నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

సైబరాబాద్ కమీషనరేట్లలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో సైబరాబాద్ పరిధిలో ఉన్న పోలీస్ అధికారులు,  వివిధ సెక్షన్ల సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో పాల్గొని బతుకమ్మ ఆడి  సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపారు. బతుకమ్మలను అందంగా అలంకరించి చుట్టూ పెద్ద వలయాకారంలో ఆడుతూ, బతుకమ్మ పాటలు పాడుతూ ఐక్యత, సోదరభావం, ప్రేమను కలపి రంగరిస్తూ మానవ హారం ఏర్పరిచి పాటలు పాడారు.

ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ మాట్లాడుతూ బతుకమ్మ సంబురాల్లో పోలీసు కుటుంబ సభ్యులందరినీ  కలిసినందుకు, వారి కుటుంబసభ్యులతో బతుకమ్మ ఆడటం ఆనందంగా ఉందని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ అన్నారు. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్ధాలుగా జరుపుకుంటున్నారని తెలిపారు. 

‘బతుకమ్మ’ బతుకుని కొలిచే పండుగ. ఎక్కడైనా దేవుళ్లకు పూలు పెట్టి కొలుస్తాము, కానీ పువ్వులనే దేవత గా కొలిచే సాంప్రదాయం మన తెలంగాణ లో మాత్రమే ఉందన్నారు.

బతుకమ్మ పాటలు వినసొంపుగా ఉంటాయన్నారు. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, గౌరమ్మ గౌరమ్మ’ అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, చరిత్ర, పురాణాలు మేళవిస్తారన్నారు.

తెలంగాణ సంస్కృతికి చారిత్రక చిహ్నం బతకమ్మ పండుగ అన్నారు. భారతదేశ ఔన్నత్యాన్ని, తెలంగాణ సంస్కృతిని తెలిపే ఈ  పండుగ విశిష్టత తరతరాలుగా కొనసాగుతూ, ఐకమత్యాన్ని పెంపొందించాలని కోరుతూ అందరికీ బతుకమ్మ పండుగ మరియు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఆయన సతీమణి వినీల, ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎమ్ విజయ్ కుమార్, విమన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ అనసూయ, బాలానగర్ డీసీపీ పీవీ పద్మజా, ఎస్ఓటీ డీసీపీ సందీప్, డీసీపీ కవిత, డీసీపీ లావణ్య ఎన్జేపీ, ఏడీసీపీ రవి కుమార్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ ఎండీ రియాజ్ ఉల్ హక్, ఏసీపీలు మట్టయ్య, ధనలక్ష్మి, మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, ఎస్సీఎస్సీ జనరల్ సెక్రెటరీ కృష్ణ ఏదుల, సీఏఓ అకౌంట్స్ చంద్రకళ, సీఏఓ అడ్మిన్ గీత,  ఇన్ స్పెక్టర్లు, పోలీస్ అధికారులు సంఘం అధ్యక్షుడు భద్రా రెడ్డి, పోలీస్ అధికారులు సంఘం ఆర్గనైజింగ్ సెక్రెటరీ కృష్ణా రెడ్డి,  సీటీసీ డాక్టర్ సుకుమార్, వివిధ సెక్షన్ల సిబ్బంది, పోలీస్ కుటుంబ సభ్యులు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

కోవాక్సిన్: అతి త్వరలో కరోనా వ్యాక్సిన్ రెడీ

Satyam NEWS

కడప నగరంలో వివాహిత దారుణ హత్య

Satyam NEWS

మంచి సందేశం ఇచ్చే చిత్రం పలాస 1978

Satyam NEWS

Leave a Comment