28.7 C
Hyderabad
April 26, 2024 08: 42 AM
Slider కడప

కడప నగరంలో వివాహిత దారుణ హత్య

#Crime Scene

కడప నగరంలో ఒక వివాహితను దారుణంగా హత్య చేశారు. కడప నగరంలోని రవీంద్రనగర్ లో ఈ ఘటన జరిగింది. బీబీజాన్ అనే వివాహిత దారుణ హత్యకు గురి కావడం నగరంలో సంచలనం కలిగించింది.

ఈ దారుణ హత్యను బీబీజాన్ భర్తే చేశాడని పోలీసులు తెలిపారు. హత్య జరిగే సమయంలో అటువైపు గా వెళ్తున్న హతురాలి చెల్లి పై కూడా హత్యాయత్నం చేశాడని పోలీసులు తెలిపారు.

బీబీజాన్ అక్కడికక్కడే మృతి చెందగా, హతురాలి చెల్లెలు  పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతి స్విమ్స్  తరలించారు.

భార్య ప్రవర్తనపై అనుమానంతో ఆమె భర్త దస్తగిరి దారుణంగా వేటకొడవలి తో హత్య చేసినట్లు డిఎస్పీ సునీల్  వెల్లడించారు.

తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

ఆగ్రిగోల్డ్ బాధితులకు ఇప్పటికైనా న్యాయం చేయాలి

Satyam NEWS

షర్మిల పాదయాత్రలో దొంగల చేతివాటం

Satyam NEWS

ప్రపంచ మత్స్యకార దినోత్సవం ప్రారంభం

Satyam NEWS

Leave a Comment