28.7 C
Hyderabad
April 28, 2024 05: 06 AM
Slider వరంగల్

ఆడ‌బిడ్డ‌ల‌కు బ‌తుక‌మ్మ చీర‌లు పంపిణీ చేసిన ఎర్రబెల్లి

#MinisterErrabelly

దారిద్య్ర రేఖ‌కు దిగువ‌న ఉన్న, 18 ఏళ్ళు నిండిన ప్ర‌తి మ‌హిళ‌కు చీర‌లు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు.

వరంగల్ రూరల్ జిల్లా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం, రాయపర్తి లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో  మ‌హిళ‌ల‌కు బ‌తుక‌మ్మ చీర‌ల‌ను ఆయన నేడు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మహిళలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి బతుకమ్మ లతో ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌భుత్వ‌మే ప్ర‌జ‌ల‌ పండుగ‌ల‌ని నిర్వ‌హిస్తున్న‌దని ఆయన అన్నారు.

రంజాన్ కానీ, క్రిస్మస్ కానీ, బ‌తుక‌మ్మ పండుగ కానీ, ప్ర‌భుత్వమే ప్ర‌జ‌ల‌కు బ‌ట్ట‌లు పెట్టి పండుగ‌ని చేయ‌డం చరిత్ర‌లో ఎక్క‌డా లేదని మంత్రి అన్నారు.

సిఎం కెసిఆర్ 2017లో బ‌తుక‌మ్మ పండుగ‌ని రాష్ట్ర పండుగ‌గా ప్ర‌క‌టించారని మంత్రి తెలిపారు. ప్ర‌తి ఏడాది రాష్ట్రంలో 1 కోటి 2 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌ల‌కు చీర‌లు అందిస్తున్నం.

రాష్ట్రంలో 20ల‌క్ష‌ల‌, 36వేల‌, 234 కుటుంబాల‌కు ఈ చీరలు అందుతున్న‌యి. గ‌త ఏడాది 313 కోట్లు ఖ‌ర్చు చేస్తే, ఈ ఏడాది 317 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నం.

గ‌త ఏడాది 110 ర‌కాల రంగురంగుల చీర‌లు అందిస్తే, ఈసారి 287 ర‌కాల చీర‌లు ఇస్తున్నం అని ఆయన అన్నారు.

Related posts

తిరుమల శ్రీవారికి రికార్డ్ స్థాయిలో ఆదాయం

Bhavani

‘నాలుగేళ్ల నరకం’ పేరుతో టీడీపీ కొత్త కార్యక్రమం

Satyam NEWS

రీసెర్వ్డ్:రైల్ లో పరమేశ్వరునికి ప్రత్యేక బెర్త్

Satyam NEWS

Leave a Comment