29.7 C
Hyderabad
April 29, 2024 10: 02 AM
Slider ప్రపంచం

కరోనా వైరస్ ను తేలికగా తీసుకుంటున్నవారికి ఇది హెచ్చరిక

#corona virus on skin

కరోనా వైరస్ అంటే తేలికగా తీసుకుంటున్న వారికి హెచ్చరిక. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నది జాగ్రత్తలు తీసుకోమని చెబుతున్నా వినకుండా విచ్చలవిడిగా మొహానికి మాస్కు కూడా లేకుండా తిరుగుతున్నవారికి ఇది దుర్వార్త.

కరోనా వైరస్ మానవ శరీరంపై కనీసం 9 గంటలు జీవించి ఉంటుందని తాజా అధ్యయనాలలో తేలింది. ఫ్లూ వైరస్ కన్నా కరోనా వైరస్ ఎక్కువ సమయం పాటు మానవ శరీరంపై కూడా జీవించి ఉంటుంది.

ఫ్లూ వైరస్ మానవ శరీరంపై కేవలం రెండు గంటలే జీవించి ఉంటుంది కాగా కరోనా వైరస్ 9 గంటల వరకూ జీవించి ఉంటుందని జపాన్ లోని కైటో పర్ ఫెక్చురల్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ వెల్లడించింది.

ఈ మేరకు క్లినికల్ ఇన్ ఫెక్షన్స్ డిసీజెస్ జర్నల్ లో అధ్యయన పత్రాన్ని ప్రచురించారు. మానవ శరీరంపై 9 గంటల పాటు జీవించి ఉండే కరోనా వైరస్ మరొకరికి సోకేందుకు అన్ని అవకాశాలు ఉంటాయి.

చేతులు శుభ్ర పరచుకోవడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు కానీ చర్మంపై కూడా కరోనా వైరస్ జీవించి ఉండే కాలం ఎక్కువగా ఉన్నందున శరీర పరిశుభ్రత కూడా అవసరమేనని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

Related posts

మహారాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్ భాగస్వామ్యం

Satyam NEWS

కౌంటర్: ఎన్నికలు సజావుగా సాగేందుకే ఆర్డినెన్స్‌

Satyam NEWS

అప్పుల కుప్పగా మారిన తెలంగాణ విద్యుత్ రంగం

Satyam NEWS

Leave a Comment