Slider విజయనగరం

54 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా బీసీల అభ్యున్నతి

#kolagatla

బిసి కార్పొరేషన్ ల పదవీకాలం పొడిగింపు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు  జారీ చేయడంతో బీసీ వర్గాలలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపధ్యంలో విజయనగరం నియోజకవర్గంలో ఆయా  బిసి కార్పొరేషన్ ల  డైరెక్టర్లు … డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ని ఆయన నివాసంలో  మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చమిచ్చి , శాలువా కప్పి తమ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి  మాట్లాడుతూ ప్రజారంజక  పాలన చేస్తున్న సీఎం జగన్ బీసీల పక్షపాతి అని, తన పాదయాత్రలో బీసీలకు అన్ని విధాల న్యాయం చేస్తానని ఇచ్చిన హామీలకు అనుగుణంగా అధికారం చేపట్టిన తర్వాత బీసీలకు ప్రాధాన్యం ఇచ్చే అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. సంక్షేమంలో  50 శాతం బీసీలకు అమలు చేయడం గొప్ప విషయమని అన్నారు.  ఆయా బిసి కార్పొరేషన్ ల ద్వారా  బీసీ వర్గాలకు మరింత మెరుగైన సేవలు అందించాలన్నారు.

ఈ సందర్భంగా ఆయా  బీసీ కార్పొరేషన్ ల డైరెక్టర్లు మాట్లాడుతూ సీఎం జగన్ కూడా తమ ధన్యవాదాలు తెలియజేశారు. తమను అన్ని విధాలా ప్రోత్సహించిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల కూడా తమ కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో 54 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా, బీసీల అభ్యున్నతికి సీఎం ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యమిస్తూ  ప్రజా రంజక  పాలన సాగిస్తున్నారని అన్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్లను మర్యాదపూర్వకంగా కలిసిన వారిలో రాష్ట్ర నాగవంశపపు కార్పొరేషన్ డైరెక్టర్ ఆవనాపు లక్ష్మణరావు, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ రౌతు భాస్కరరెడ్డి, రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్ డైరెక్టర్  బోగి కుసుమ కుమారి, రాష్ట్ర చాత్తద  శ్రీవైష్ణవ కార్పొరేషన్ డైరెక్టర్ దాస్యం వామనాచారి, శ్రీరామమూర్తి, నాగవంశ సంఘ ప్రతినిధులు కాళ్ళ సూరిబాబు, కాళ్ళ సత్యనారాయణ, బేరి సత్యనారాయణ, అవనాపు  రాజు , కాళ్ళ సునీల్, మొకర  సతీష్,  కాళ్ళ ఆనంద్, కాళ్ళ సుధాకర్ తదితరులు ఉన్నారు.

Related posts

కరోనా రోగులకు శుభవార్త: కొత్త మందు వచ్చేసింది

Satyam NEWS

ముంపు బాధితులను అండగా ఉంటాం

Bhavani

అంగన్‌వాడీ కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు

Satyam NEWS

Leave a Comment