31.7 C
Hyderabad
May 2, 2024 08: 31 AM
Slider హైదరాబాద్

పూలే విగ్రహం ఏర్పాటు కోసం 3న హైదరాబాద్ లో దీక్ష

#BC Leaders

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని నెక్లేస్  రోడ్ లో  మాజీ ప్రధాని పి వి నర్సింహా రావు 25 అడుగుల కాంస్య విగ్రహాన్ని  ఏర్పాటు చేశారని, దీన్ని తాము కూడా స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘo రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

అయితే టి ఆర్ ఎస్ ప్రభుత్వం  హైదరాబాద్ లోని ప్రధాన కూడలిలో గాని ,ట్యాంక్ బ్యాండ్, నెక్లెస్ రోడ్ ప్రాంతాలలో గాని సామాజిక సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిబా పూలే విగ్రహాన్నీ ఏర్పాటు చేయడం లేదని ఆయన అన్నారు. ఏడు సంవత్సరాలుగా ప్రతి పారీ పూలే జయంతి సభ లో ప్రకటిస్తూనే ఉన్నారని, నేటి వరకు ఏర్పాటు ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. పూలే విగ్రహం ఏర్పాటు చేసిన తరువాతే మిగతా వాళ్ళవి ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

నేడు నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రoలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రo వస్తే ట్యాంక్ బండ్ పై మహనీయుల విగ్రాహాలు ఏర్పాటు చేస్తామని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని ,కానీ నేటికీ అది కార్యరూపం దాల్చలేడం లేదని ఆయన అన్నారు.

సచివాలయం పక్కన 125 అడుగుల అంబెడ్కర్ విగ్రహం స్థాపిస్తామని చెప్పారని,కొండా లక్ష్మణ్ బాపూజీ,సర్దార్ సర్వాయి పాపన్న , ప్రొపెసర్ జయశంకర్, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ,లాంటి మహనీయుల  విగ్రాహాలు పెట్టడం లేదని, కనీసం వారి జయంతి ఉత్సవాలను కూడా తూ తూ మంత్రంగా నిర్వహిస్తున్నారని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు

పద కొండు కిలోమీటర్ల ఉన్న అతిపెద్ద శంషాబాద్ ప్లైఓర్ కు పివి నర్సింహ రావు ఎక్స్ ప్రెస్ హైవే గా పెట్టారని , అది చాలదు అన్నట్లు ఇప్పుడు ఏకంగా నెక్లెస్ రోడ్ కు పివి మార్గ్ గా నామకరణం చేశారని, బడుగు బలహీన వర్గాల మహనీయుల పేర్లు పెట్టడంలో వివక్ష చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు

ఇప్పటికైన పూలే,కొండా లక్ష్మణ్ బాపూజీ, సర్దార్ సర్వాయి పాపన్న,దొడ్డి కొమురయ్య,చాకలి ఐలమ్మ, ధర్మబిక్ష్మం, ప్రొపెసర్ జయశంకర్, శ్రీకాంత్ చారి,బెల్లి లలిత, సాంబశివుడుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఆయన ముఖ్యమంత్రి కెసిఆర్ ను డిమాండ్ చేశారు. లేని రేపు మూడోవ తేదీన జరిగే దీక్షలో బిసి ఉద్యమ కార్యాచారణ ప్రకటిస్తామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.

ఈ సమావేశంలో బిసి నాయకులు ఎద్దులపురి కృష్ణ, రావులకోల్  ప్రాజపతి,గోపారి రామచంద్రo, మహేష్ ,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

గోడ కూలి ముగ్గురు చిన్నారుల మృతి

Sub Editor

Analysis: భారత్ వైపు చూస్తున్న అమెరికా పెద్దన్న

Satyam NEWS

దిశ తల్లిదండ్రులపై టిఆర్ఎస్ నాయకురాలి దారుణ వ్యాఖ్యలు

Satyam NEWS

Leave a Comment